Cinema News: ఆ స్ఫూర్తితో ‘బనారస్’
జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో జంటగా జయతీర్థ తెరకెక్కించిన చిత్రం ‘బనారస్’ (Banaras). తిలక్ బల్లాల్ నిర్మించారు. అజనీష్ లోక్‌నాథ్ స్వరాలందించారు. ఈ సినిమా త్వరలో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలోని ‘‘మాయ గంగ’ పాటను దర్శకుడు సుకుమార్(Sukumar) హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘పాట చాలా బాగుంది. కె.కె. చక్కటి సాహిత్యమందించారు. జైద్ తండ్రి పెద్ద రాజకీయ నాయకుడు. ఆసక్తితో జైద్ సినిమాల్లోకి వచ్చాడు. పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమా విజయవంతం కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘త్వరలో రానున్న మా సినిమానీ అలాగే ఆదరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు చిత్ర దర్శకుడు. హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ.. ‘‘హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది. ఆశీర్వదించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘పుష్ప’ సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నాం’’ అన్నారు నిర్మాత. కె.కె, సోనాల్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


ఎక్కువ మంది చదివినవి (Most Read)
- weekly horoscope :రాశిఫలం ( ఆగస్టు 7 - ఆగస్టు 13)
- Chandrababu-Modi: అప్పుడప్పుడు దిల్లీకి రండి: చంద్రబాబుతో ప్రధాని మోదీ
- Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్ చేశా: నిత్యామేనన్
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- అక్క కాదు అమ్మ.. చెల్లి కాదు శివంగి
- Hyderabad News : తండ్రీ కుమారుడి నుంచి రూ.16.10 కోట్లు కొట్టేశారు
- ఫైర్ కంపెనీ ఉద్యోగికి భయానక పరిస్థితి.. గుండెలు పిండేసే ఘోరం!
- Stomach ulcers: అల్సర్ ఎందుకొస్తుందో తెలుసా..?
- సూర్య అనే నేను...
- INDIA vs WI: వెస్టిండీస్‌పై ఘన విజయం..సిరీస్ భారత్ సొంతం