Dhamaka: వాట్స్‌ హ్యాపెనింగ్‌..

రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 12 Nov 2022 08:58 IST

రవితేజ (Raviteja), శ్రీలీల (Sreeleela) జంటగా త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం ‘ధమాకా’. టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు. ఈ సినిమా డిసెంబరు 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఈ చిత్రంలోని ‘‘వాట్స్‌ హ్యాపెనింగ్‌..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు భీమ్స్‌ సిసిరోలియో స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. రమ్య బెహరా, భార్గవి పిళ్లై సంయుక్తంగా ఆలపించారు. శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. ‘‘ఇదొక చక్కటి మాస్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌. రవితేజ నటన సినిమాకి ప్రధాన ఆకర్షణ. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి కథ, మాటలు: ప్రసన్న కుమార్‌ బెజవాడ, ఛాయాగ్రహణం: కార్తీక్‌ ఘట్టమనేని.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని