
Major: చిక్కులన్ని కూర్చి.. లెక్కలేవో నేర్చి
‘‘హాయి హాయి హాయి.. ఈ మాయ ఏమిటోయి.. గుండె ఆగి ఆగి ఎగురుతున్నది. చిక్కులన్ని కూర్చి.. ఓ లెక్కలేవో నేర్చి.. అంకెలాటలేవో ఆడుతున్నది’’ అంటూ ప్రేయసిని తలచుకుంటూ ప్రేమ పాట పాడుకుంటున్నారు అడివి శేష్. మరి ఆయన మనసుదోచిన ఆ సుందరి ఎవరు? వారి ప్రేమకథ ఏ తీరానికి చేరింది? తెలియాలంటే ‘మేజర్’ చూడాల్సిందే. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథతో రూపొందిన చిత్రమిది. టైటిల్ పాత్రను శేష్ పోషించారు. శశికిరణ్ తిక్క తెరకెక్కించారు. సయీ మంజ్రేకర్ కథానాయిక. ఈ సినిమా జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్రం నుంచి ‘‘ఓహ్ ఇషా’’ వీడియో గీతాన్ని విడుదల చేశారు. సందీప్ తన తొలి ప్రేమ జ్ఞాపకాలను గుర్తుచేసుకునే సందర్భంలో వచ్చే మెలోడీ గీతమిది. శ్రీచరణ్ పాకాల స్వరాలు సమకూర్చారు. రాజీవ్ భరద్వాజ్ సాహిత్యమందించారు. అర్మాన్ మాలిక్, చిన్మయి శ్రీపాద సంయుక్తంగా ఆలపించారు. మేజర్ సందీప్ బాల్యం, యవ్వనం, సైన్యంలో చేరి ఆయన చేసిన సాహసాలు, ముంబయి ఉగ్ర దాడిలో వీరమరణం చెందడం.. వంటి అన్ని అంశాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ఇందులో శోభితా ధూళిపాళ, ప్రకాశ్ రాజ్, రేవతి, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు. దీన్ని మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్, సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Business News
Suzuki katana: మార్కెట్లోకి సుజుకీ స్పోర్ట్స్ బైక్.. ధర ₹13.61 లక్షలు
-
India News
MK Stalin: ఎవరైనా అలా చేస్తే నేనే డిక్టేటర్‌గా మారతా.. చర్యలు తీసుకుంటా : సీఎం స్టాలిన్
-
Politics News
Devendra Fadnavis: అవును.. మాది ‘ఈడీ’ ప్రభుత్వమే..!
-
Sports News
IND vs ENG: నాలుగో రోజు తొలి సెషన్ పూర్తి.. టీమ్ఇండియా ఆధిక్యం 361
-
Movies News
Bimbisara: చరిత్రలోకి తీసుకెళ్లేలా ‘బింబిసార’ ట్రైలర్.. కల్యాణ్‌రామ్ రాజసం చూశారా!
-
Politics News
Telangana News: కాంగ్రెస్ గూటికి తెరాస మేయర్.. రాహుల్ సమక్షంలో చేరిక
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Cyber Crime: ఆన్లైన్ మోసానికి సాఫ్ట్వేర్ ఉద్యోగిని బలి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (04-07-2022)
- బిగించారు..ముగిస్తారా..?
- భార్యతో అసహజ శృంగారం.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్
- Raghurama: ఏపీ పోలీసులు ఫాలో అవుతున్నారని రైలు దిగిపోయిన ఎంపీ రఘురామ
- Hyderabad News: నన్ను లోనికి రానివ్వలేదనేది దుష్ప్రచారమే: యాదమ్మ
- cook yadamma : ఔరౌర పెసర గారె.. అయ్యారె సకినాలు..!
- IND vs ENG: బుమ్రా స్టన్నింగ్ క్యాచ్.. బెన్‌స్టోక్స్‌ను ఎలా ఔట్ చేశాడో చూడండి
- Shiv Sena: టార్గెట్ ఠాక్రే.. అసలు సిసలు ‘మహా’ రాజకీయ వ్యూహం..!
- ప్రేమ పెళ్లి చేసుకున్నాడని మట్టుబెట్టారు