Updated : 13 Aug 2022 08:54 IST

Cinema News: మరీ ఇంత అందమేంటి.. సిన్నీ సిన్నీ!

విజయనిర్మల మనవడు శరణ్‌ కుమార్‌ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘మిస్టర్‌ కింగ్‌’ (Mr King). దీన్ని శశిధర్‌ చావలి తెరకెక్కిస్తున్నారు. బి.ఎన్‌.రావు నిర్మాత. నిష్కల, ఊర్వీ సింగ్‌ కథానాయికలు. మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘మరీ ఇంత అందమేంటి సిన్నీ సిన్నీ’’ పాటను ఇటీవల విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల సాహిత్యమందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ‘‘యూత్‌ఫుల్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల  తేదీ ప్రకటిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఛాయాగ్రహణం: తన్వీర్‌ అంజుమ్‌.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని