Sindhooram: మనసుని హత్తుకునేలా ‘సింధూరం’ కొత్త పాట

‘ఆనందమో ఆవేశమో’ అనే పాటతో యువతను ఆకట్టుకున్న ‘సింధూరం’ సినిమా నుంచి సరికొత్త పాట విడుదలైంది.

Published : 08 Dec 2022 14:48 IST

హైదరాబాద్‌: శివ బాలాజీ (Siva Balaji), ధర్మ, బ్రిగిడ సాగ ప్రధాన పాత్రల్లో నటించిన సరికొత్త చిత్రం ‘సింధూరం’ (Sindhooram). శ్యామ్‌ తుమ్మలపల్లి దర్శకుడు. గ్రామీణ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో ఈ సినిమా తెరకెక్కింది. ‘ఆనందమో ఆవేశమో’ అంటూ ఇటీవల ఈ సినిమా నుంచి విడుదలైన మొదటిపాట అతి తక్కువ సమయంలో 1 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకోని విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. ‘ఓ మాదిరిగా’ అంటూ సాగే ఈ పాటను ప్రముఖ దర్శకుడు పరశురామ్‌ విడుదల చేశారు. పాట బాగుందని, సాహిత్యం చక్కగా కుదిరిందని ఆయన ప్రశంసించారు. అలాగే, సినిమా మంచి విజయం అందుకోవాలని కోరుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని