Cinema News: నువ్వేలే నువ్వేలే...

దుల్కర్‌ సల్మాన్‌, కాజల్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హే సినామిక’. అదితిరావు హైదరీ ముఖ్యభూమిక పోషించారు. ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 26 Jan 2022 07:18 IST

దుల్కర్‌ సల్మాన్‌, కాజల్‌ జంటగా రూపొందుతున్న చిత్రం ‘హే సినామిక’. అదితిరావు హైదరీ ముఖ్యభూమిక పోషించారు. ప్రముఖ నృత్య దర్శకురాలు బృందా దర్శకత్వం వహిస్తున్నారు. జియో స్టూడియోస్‌ నిర్మిస్తున్నారు. పలు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ప్రాణం... అంటూ సాగే ఈ సినిమాలోని పాటని ఈ నెల 27న విడుదల చేస్తున్నారు. ‘నువ్వేలే నువ్వేలే వానలా... నాలో కురిశావు లే, నువ్వేలే నువ్వేలే పూవులా... నాలోన విరిశావులే’ అంటూ మొదలయ్యే ఆ పాట టీజర్‌ని మంగళవారం విడుదల చేశారు. గోవింద్‌ వసంత స్వరకల్పనలోని ఆ గీతాన్ని రాంబాబు గోసాల రచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని