RGV: అందుకే ‘కొండా’ చిత్రం తీశా- రామ్‌గోపాల్‌ వర్మ

త్రిగుణ్‌, ఇర్రా మోర్‌ జంటగా రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన చిత్రం ‘కొండా’. కొండా మురళి - సురేఖ దంపతుల జీవిత కథతో తెరకెక్కించారు. కొండా సుష్మితా పటేల్‌ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో రెండో థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు.

Updated : 04 Jun 2022 07:22 IST

త్రిగుణ్‌, ఇర్రా మోర్‌ జంటగా రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన చిత్రం ‘కొండా’. కొండా మురళి - సురేఖ దంపతుల జీవిత కథతో తెరకెక్కించారు. కొండా సుష్మితా పటేల్‌ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం హైదరాబాద్‌లో రెండో థియేట్రికల్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ఈ సందర్భంగా రామ్‌గోపాల్‌ వర్మ మాట్లాడుతూ.. ‘‘ఓ వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు 90ల కాలం నాటి నక్సలిజం పరిస్థితుల గురించి తెలుసుకున్నా.  కొండా మురళి - సురేఖ దంపతుల పేర్లు ప్రత్యేకంగా అనిపించాయి. అంతకు ముందు అలాంటి పాత్రల గురించి వినలేదు, చదవలేదు, చూడలేదు. వాళ్ల గురించి తెలిశాక.. సినిమా తీయాలని రీసెర్చ్‌ చేశా. కొండా ఫ్యామిలీని కలిశా. సినిమా చేయాలనుకుంటున్నట్లు చెప్పా. ‘మా అమ్మానాన్న కథ కాబట్టి నేనే ప్రొడ్యూస్‌ చేస్తాన’ని కొండా దంపతుల కుమార్తె సుష్మితా చెప్పారు. ఇందులో కొండా దంపతుల కాలేజీ జీవితం నుంచి వాళ్లు రాజకీయాల్లోకి వచ్చే వరకు జరిగిన కథని చూపించా’’ అన్నారు. ‘‘కొండా మురళి పాత్రలో.. నేను ఇలా కనిపిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను హైదరాబాద్‌లో పెరిగా. వర్మ కథ చెప్పాక.. వరంగల్‌ వెళ్లి ఆ చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం దొరికింది. 23న ప్రేక్షకుల ముందుకొస్తుంది. థియేటర్లలోనే చూడండి’’ అన్నారు హీరో త్రిగుణ్‌. నిర్మాత సుష్మితా పటేల్‌ మాట్లాడుతూ.. ‘‘మా అమ్మానాన్న ఇద్దరూ విద్యార్థి నాయకులుగానే ప్రయాణం ప్రారంభించారు. తర్వాత రాడికల్‌ నేపథ్యం వైపు ఆకర్షితులయ్యారు. రాజకీయంగా చాలా ఒడుదొడుకులు ఎదుర్కొన్నారు. ఇవన్నీ జనాలకు తెలియజేయాలని ఈ చిత్రం చేశాం. నాన్న మురళి పాత్రలో త్రిగుణ్‌ అద్భుతంగా నటించారు’’ అన్నారు.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని