మెగా నివాసంలో ఇలా.. అల్లు వారు అలా.. న్యూ ఇయర్‌ వేడుకల్లో సెలబ్రిటీలు

నూతన సంవత్సర వేడుకల్లో సినీతారలు ఫుల్‌గా ఎంజాయ్‌ చేశారు. కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి న్యూ ఇయర్‌ వేడుకల్లో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టా వేదికగా వారు షేర్‌ చేశారు.  

Published : 01 Jan 2023 11:22 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నూతన సంవత్సర వేడుకలను (New Year 2023) సినీ తారలు ఎంతో సందడిగా చేసుకున్నారు. కుటుంబసభ్యులు, సన్నిహితులతో కలిసి సరదాగా గడిపారు. కొంతమంది తారలు తమకిష్టమైన ప్రాంతానికి వెళ్లి ఈ వేడుకలు చేసుకోగా.. మరి కొంతమంది తమ ఇంట్లోనే సంతోషంగా నిర్వహించుకున్నారు. అగ్రకథానాయకుడు మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నివాసంలో జరిగిన న్యూ ఇయర్‌ వేడుకల్లో రామ్‌చరణ్‌ స్నేహితుడు శర్వానంద్‌ పాల్గొన్నారు. చిరు-చరణ్‌తో దిగిన ఓ ఫొటోని ఆయన సోషల్‌మీడియా వేదికగా షేర్‌ చేశారు. చెర్రీ-ఉపాసన దంపతులు ఏర్పాటు చేసిన ఈ పార్టీకి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

ఇక, అల్లు అర్జున్ (Allu Arjun)‌, మహేశ్‌బాబు (MaheshBabu) తమ కుటుంబసభ్యులతో కలిసి టూర్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఘట్టమనేని ఫ్యామిలీ వేడుకల ఫొటోని నమ్రత షేర్‌ చేయగా.. అల్లు అర్జున్‌ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఓ ఫొటో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇక, అలియా భట్‌, అర్జున్‌కపూర్‌, కత్రినా కైఫ్‌తోపాటు పలువురు తారలు.. న్యూ ఇయర్‌ వేడుకల ఫొటోలను ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని