Manchu Manoj: భారీ కాన్వాయ్‌తో కర్నూలుకు మంచు మనోజ్
వివాహం తర్వాత మొదటిసారి అత్తవారింటికి వెళ్లారు నటుడు మంచు మనోజ్ (Manchu Manoj). తన సతీమణి మౌనికా రెడ్డితో కలిసి కుటుంబసభ్యుల ఆశీస్సులు తీసుకున్నారు.
హైదరాబాద్: నటుడు మంచు మనోజ్ (Manchu Manoj) ఆదివారం కర్నూలుకు చేరుకున్నారు. వివాహం తర్వాత మొదటిసారి తన సతీమణి భూమా మౌనికా రెడ్డి(Mounika Reddy)తో కలిసి ఆయన అత్తవారింటికి వెళ్లారు. మౌనికా రెడ్డి తాతయ్య ఎస్వీ సుబ్బారెడ్డి (శోభా నాగిరెడ్డి తండ్రి)ని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. భారీ కాన్వాయ్ నడుమ వీరిద్దరూ కర్నూలుకు చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
మనోజ్, మౌనిక ఎన్నో ఏళ్ల నుంచి స్నేహితులు. గతంలో వైవాహిక బంధంలో ఎదురుదెబ్బలు తిన్న వీరిద్దరూ కుటుంబసభ్యుల అంగీకారంతో ఇటీవల పెళ్లి చేసుకున్నారు. హైదరాబాద్‌లోని లక్ష్మి నివాసంలో శుక్రవారం రాత్రి వీరి వివాహం వేడుకగా జరిగింది. సినీ, రాజకీయ ప్రముఖులు ఈ వేడుకలో సందడి చేశారు. శనివారం వీరి పెళ్లి ఫొటోలు బయటకు రాగా.. నెటిజన్లు, సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Karnataka Elections: రాహుల్ చెప్పినట్లే.. కుమారుడి స్థానం నుంచి సిద్ధరామయ్య పోటీ
-
Politics News
Ambati Rambabu: ఆ నలుగురిని శాశ్వతంగా బహిష్కరించే అవకాశం
-
General News
TSPSC Paper Leak Case : టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకున్న సిట్..
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
LB nagar flyover : ఇక సిగ్నల్ ఫ్రీగా ఎల్బీనగర్ కూడలి.. నేడు మరో పైవంతెన అందుబాటులోకి
-
Sports News
IPL: ‘బీసీసీఐ ఎలాంటి ఆదేశాలివ్వలేదు’ : దిల్లీ క్యాపిటల్స్ సీఈవో