Athiya-Rahul: అతియా-రాహుల్‌ జంటకు రూ.50కోట్ల ఫ్లాట్‌.. రూ.1.64కోట్ల కారు..ఇంకా!

కేఎల్‌ రాహుల్‌ (KL Rahul), నటి అతియా శెట్టి (Athiya Shetty) వివాహబంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లికి వచ్చిన బహుమతులపై నెట్టింట వార్తలు మొదలయ్యాయి.

Published : 25 Jan 2023 17:40 IST

హైదరాబాద్‌: భారత స్టార్‌ క్రికెటర్‌ కేఎల్‌ రాహుల్‌ (KL Rahul) తన ప్రియురాలు, నటి అతియాశెట్టి (Athiya Shetty) మెడలో మూడు ముళ్లు వేసిన విషయం తెలిసిందే. అతిథులు, కుటుంబసభ్యుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. రెండు రోజులుగా వీరి పెళ్లి ఫొటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.  ప్రముఖులు, నెటిజన్లు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్‌లు పెడుతున్నారు. ఇక వీరి పెళ్లికి వచ్చిన బహుమతులపై నెట్టింట వార్తలు మొదలయ్యాయి. వీరికి సినీ, క్రీడారంగంలోని ప్రముఖులు ఇచ్చిన గిఫ్ట్‌లు ఇవి.. అంటూ వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి(Suniel Shetty) తన కుమార్తెకు పెళ్లి బహుమతిగా ముంబయిలో ఓ విలాసవంతమైన ఫ్లాటును ఇచ్చారట. దీని విలువ సుమారు రూ.50కోట్లు ఉంటుందంటున్నారు. అలాగే సునీల్‌ శెట్టి క్లోజ్‌ ఫ్రెండ్‌ బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌(Salman Khan) ఈ కొత్త జంటకు రూ.1.64కోట్లు విలువ చేసే ఆడీ కారు గిఫ్ట్‌ ఇచ్చారని సినీప్రేక్షకులు చెబుతున్నారు. అతియా శెట్టికి రూ.30లక్షలు విలువ చేసే వాచ్‌ని బహుమతిగా ఇచ్చాడట మరో నటుడు జాకీ ష్రాఫ్(Jackie Shroff)‌. అతియాకు అర్జున్‌ కపూర్‌(Arjun Kapoor)  డైమండ్‌ హారం ఇచ్చినట్లు సమాచారం. అలాగే క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ(Virat Kohli) ఈ క్యూట్‌ కపుల్‌కి బీఎమ్‌డబ్ల్యూ కారు ఇచ్చారని.. ఇక ధోని(Dhoni) ఒక బైక్‌ను గిఫ్ట్‌ ఇచ్చారని సమాచారం. ఇక అతియా, రాహుల్‌లు ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్‌ కోసం ముంబయిలో గ్రాండ్‌గా రిసెప్షన్‌ నిర్వహించనున్నారు. ఈ రిసెప్షన్‌ వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని సునీల్‌ శెట్టి మీడియాకు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని