Newsense: ఓటీటీలో నవదీప్‌ ‘న్యూసెన్స్‌’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

NEWSENSE: నవదీప్‌, బిందు మాధవి జంటగా నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’ ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అయ్యేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ విడుదల చేశారు.

Published : 06 May 2023 18:17 IST

హైదరాబాద్‌: ‘బలం ఉన్నోడికి చేతులు ఎత్తి మొక్కాలి.. రాళ్లు విసరకూడదు’ అంటున్నారు నవదీప్‌ (Navdeep). ఆయన కీలక పాత్రలో నటించిన సరికొత్త వెబ్‌సిరీస్‌ ‘న్యూసెన్స్‌’ (Newsense). బిందు మాధవి (Bindu Madhavi) కథానాయిక, శ్రీ ప్రవీణ్‌ కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్స్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌సిరీస్‌ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో మే 12 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఈ నేపథ్యంలో శనివారం ఈ సిరీస్‌ ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘ఇక్కడ ఎవడి సొమ్ము.. ఎవడూ తినడం లేదు. ఎవడి దమ్ము వాడిదే’ అంటూ వినిపిస్తున్న సంభాషణలు ఆకట్టుకుంటున్నాయి. ట్రైలర్‌  చూస్తుంటే, మీడియా రంగాన్ని ఉద్దేశించి ఈ సిరీస్‌ను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని