తర్వాతి జేమ్స్‌బాండ్‌.. మహిళా?

‘బాండ్‌... జేమ్స్‌బాండ్‌’ అంటూ కథానాయకుడు డైలాగ్‌ చెబుతుంటే... కళ్లప్పగించి మరీ చూస్తారు ప్రేక్షకులు. బాండ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ అది. ప్రస్తుతం ‘007’ సిరీస్‌లో

Published : 18 Oct 2020 17:05 IST

‘బాండ్‌... జేమ్స్‌బాండ్‌’ అంటూ కథానాయకుడు డైలాగ్‌ చెబుతుంటే... కళ్లప్పగించి మరీ చూస్తారు ప్రేక్షకులు. బాండ్‌ చిత్రాలకున్న క్రేజ్‌ అది. ప్రస్తుతం ‘007’ సిరీస్‌లో 25వ చిత్రంగా ‘నో టైం టు డై’ వస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా-లాక్‌డౌన్‌ పరిస్థితులతో 2021 ఏప్రిల్‌కు వాయిదా పడిన విషయం  తెలిసిందే. దీని తర్వాత బాండ్‌ సినిమాలు చేయనని ఇప్పటికే డేనియల్‌ క్రేగ్‌ ప్రకటించారు. మరి నెక్ట్స్‌ బాండ్‌ ఎవరు? అనే దానిపై ప్రేక్షకుల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిర్మాత బార్బరా బ్రొకోలీ మాట్లాడుతూ.. తర్వాతి చిత్రంలో బాండ్‌గా నల్లజాతీయుడు గానీ, మహిళ గానీ నటించే అవకాశాలున్నాయని చెప్పారు. ఇప్పటికైతే దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, తమ దృష్టంతా ‘నో టైం టు డై’ సినిమాపైనే ఉందని తెలిపారు. తర్వాతి బాండ్‌ ఎవరనే దానిపై ఇప్పటికే హాలీవుడ్‌లో పలుపేర్లు తెరపైకొస్తున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని