పవన్‌తో మూవీ.. ఇదే నా గోల్డెన్‌ ఫిల్మ్‌

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథా చిత్రంలో తాను కూడా భాగమేనని నటి నిధి అగర్వాల్‌ క్లారిటీ ఇచ్చారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని..

Published : 05 Feb 2021 22:44 IST

స్పష్టతనిచ్చిన నిధి అగర్వాల్‌

హైదరాబాద్‌: పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ కథా చిత్రంలో తాను కూడా భాగమేనని నటి నిధి అగర్వాల్‌ క్లారిటీ ఇచ్చారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పవన్‌ సరసన కథానాయికగా నటించే అవకాశాన్ని నిధి సొంతం చేసుకున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి సోషల్‌మీడియాలో వరుస కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ వార్తలపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, తాజాగా నిధి అగర్వాల్‌ ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో #PSPK27 గురించి స్పందించారు. ఇందులో తాను నటిస్తున్నానని చెప్పారు. ‘నిజమే.. పవన్‌ సినిమాలో నేను నటిస్తున్నాను. ఇలాంటి పవర్‌ఫుల్‌ ప్రాజెక్ట్‌లో పవర్‌స్టార్‌తో కలిసి స్ర్కీన్‌ పంచుకోవడం.. నా కల నెరవేరినట్లుగా ఉంది. నటిగా ఇది నా తొమ్మిదో చిత్రం. కాబట్టి దీనిని గోల్డెన్‌ ఫిల్మ్‌గా అనుకుంటున్నాను. ఇప్పటికే నేను ఈ సినిమా షూట్‌లో పాల్గొన్నాను. పవన్‌కల్యాణ్‌ అద్భుతమైన, ఉన్నతమైన వ్యక్తి’ అని నిధి అగర్వాల్‌ అన్నారు.

పవన్‌కల్యాణ్‌ 27వ చిత్రంగా రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పీరియాడికల్‌ డ్రామాగా రానున్న ఈ సినిమాలో పవన్‌ వజ్రాల దొంగగా కనిపించనున్నారని టాక్‌. అంతేకాకుండా ఈ చిత్రానికి ‘హరిహర వీరమల్లు’ అనే పేరు ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది.

ఇదీ చదవండి

అందుకే ఆమెను బి-గ్రేడ్‌ అనేది


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని