నటికి విగ్రహం చేయించి.. వాలంటైన్స్‌డే చేసి..

వాలంటైన్స్‌ డే అనగానే తమ ప్రియమైన వారితో వేడుకలు చేసుకోవడానికి ఎక్కువమంది ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ తమిళనాడులోని కొంతమంది మాత్రం తమ ప్రేమదేవతకు విగ్రహం కట్టి పూజలు చేసి..

Published : 15 Feb 2021 15:02 IST

వైరల్‌గా మారిన తమిళ తంబీల ఫొటోలు

హైదరాబాద్‌: వాలంటైన్స్‌డే అనగానే తమ ప్రియమైన వారితో వేడుకలు చేసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ, తమిళనాడులోని కొంతమంది మాత్రం తమ ప్రేమదేవతకు విగ్రహం కట్టి పూజలు చేసి.. పాలాభిషేకాలు చేశారు. ‘సవ్యసాచి’తో కథానాయికగా దక్షిణాదిలోకి ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌. అనంతరం ఆమె తెలుగులో ‘మిస్టర్‌ మజ్ను’, ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది విడుదలైన ‘భూమి’, ‘ఈశ్వరన్‌’ చిత్రాలతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ రెండు సినిమాలతోనే అక్కడ విపరీతమైన ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు.

చెన్నైలోని కొట్టంబాకం ప్రాంతానికి చెందిన పలువురు అభిమానులు ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె విగ్రహాన్ని సిద్ధం చేయించి.. దానికి పూజలు నిర్వహించారు. అంతేకాకుండా పాలాభిషేకాలు, హారతులిచ్చి నటిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. అభిమానులు తనపై చూపించిన ప్రేమకు నిధి ఫిదా అయ్యారు. ‘నెట్టింట్లో ఫొటోలు చూసి షాక్‌ అయ్యాను. ప్రేమికుల దినోత్సవం రోజున నేను పొందిన అపురూపమైన బహుమతి ఇదే. నాపై ప్రేమ చూపిస్తున్న వారందరికీ ధన్యవాదాలు. మరిన్ని మంచి కథా చిత్రాలతో మిమ్మల్ని అలరిస్తాను’ అని నిధి తెలిపారు. మరోవైపు నిధి అగర్వాల్‌ ప్రస్తుతం పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సరసన నటిస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూట్‌లో ఇటీవల ఆమె పాల్గొన్నారు.

ఇదీ చదవండి

నిశ్చితార్థం తర్వాత పిల్లలు నాపై కోపంగా ఉన్నారుTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు