Nidhhi Agerwal: ఆ గుర్తింపు నాకు మేలే చేసింది!
అందాల నిధిలానే కనిపిస్తుంటుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ఈమె... పవన్‌కల్యాణ్‌తో కలిసి నటిస్తోంది. ఇటీవల కొత్త కథానాయకుడు అశోక్ గల్లాతో కలిసి ‘హీరో’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది.
అందాల నిధిలానే కనిపిస్తుంటుంది నిధి అగర్వాల్. ఇస్మార్ట్ హీరోయిన్గా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచిన ఈమె... పవన్‌కల్యాణ్‌తో కలిసి నటిస్తోంది. ఇటీవల కొత్త కథానాయకుడు అశోక్ గల్లాతో కలిసి ‘హీరో’లో నటించింది. ఆ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నిధి మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించింది. ఆ విషయాలివీ...
* ‘‘ఈ చిత్రంలో నేనొక వైద్యురాలిగా కనిపిస్తా. పాత్ర పేరు సుబ్బు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత మళ్లీ వైద్యురాలిగా నటించడం గమ్మత్తుగా అనిపించింది. అయితే ఆ పాత్రకీ దీనికీ మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది. డాక్టర్ని కాబోయి యాక్టర్‌ని అయ్యానని చెబుతుంటారు. కానీ నేను మాత్రం యాక్టర్‌నే కావాలనుకున్నా, అయ్యాను. సినిమాల్లో మాత్రం వైద్యురాలిగా నన్ను నేను చూసుకుంటున్నా. ఈ పాత్ర నాకొక సెంటిమెంట్ అవుతుందేమో చూడాలి. ‘హీరో’లో నటించడం ఓ మంచి అనుభవం. కుటుంబ నేపథ్యంతోపాటు... సందర్భోచితమైన కామెడీ ఉంటుంది. నా తండ్రి పాత్రలో జగపతిబాబు నటించారు. ఆయనకీ, నాకూ, హీరోకీ మధ్య సన్నివేశాలు చాలా బాగుంటాయి. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య పక్కా వాణిజ్య హంగులతో ఓ భిన్నమైన సినిమాని తీశారు’’.
* ‘‘నాలుగేళ్ల కిందట సినిమా రంగానికి నేను కూడా కొత్తే. తొలి అడుగుల్లో నాకైతే ఏమీ తెలియదు. అంతా సెట్లోకి వచ్చాకే నేర్చుకున్నా. కానీ అశోక్ గల్లా అన్నీ నేర్చుకుని కెమెరా ముందుకొచ్చారు. తనతో పనిచేయడం కొత్త నటుడితో చేస్తున్నట్టు అస్సలు అనిపించలేదు. అయినా తనకి ఇదే తొలి చిత్రం కాబట్టి సహనటిగా తనని సౌకర్యంగా ఉంచాలనుకున్నా. నా తొలి సినిమా సమయంలో కూడా కథానాయకుడు టైగర్ ష్రాఫ్ చక్కటి సహకారం అందించాడు. ఈ సినిమా ప్రయాణంలో నాకు ఆ రోజులు గుర్తుకొచ్చాయి’’.
* ‘‘సినిమా ఎంపిక కీలకమే కానీ... ఆ విషయంలో నేను ఎక్కువగా ఆలోచించను. ఒక ప్రవాహంలా ముందుకు సాగుతున్నానంతే. ‘హీరో’ ఒప్పుకున్నాక పవన్‌కల్యాణ్ సినిమా ‘హరి హర వీర మల్లు’లో నటించే అవకాశం వచ్చింది. చిన్నప్పట్నుంచి నా కోరిక హీరోయిన్ కావడమే. కానీ అందుకోసమని నేను ప్రత్యేకంగా ఏమీ సన్నద్ధం కాలేదు. సినిమాలు చేస్తూనే నేర్చుకున్నా. హిందీ, తెలుగు, తమిళం... ఇలా ఒకొక్క భాషలో కొన్ని కొత్త విషయాలు నేర్చుకుంటూ అడుగులేశా. ఇప్పుడు చేస్తున్న సినిమా నా గత సినిమా కంటే బాగుండాలనుకుంటా. వేసే ప్రతీ అడుగు మరింత ఉన్నతంగా వేయాలనేదే నా సిద్ధాంతం. ఈ ప్రయాణంలో తెలుగు చిత్రసీమ అన్నిటికంటే సౌకర్యంగా అనిపించింది. నేను ఇక్కడే పుట్టినందుకేమో, తెలుగు చిత్రసీమతో కొంచెం ఎక్కువ అనుబంధం ఉన్నట్టు అనిపిస్తుంది’’.
* ‘‘గ్లామర్ అనే మాటకి ఒకొక్కరిదీ ఒక్కో నిర్వచనం. గ్లామరస్ హీరోయిన్, కమర్షియల్ హీరోయిన్ అనే గుర్తింపు నాకు రావడంపై నేను చాలా ఆలోచించా. తర్వాత అర్థమైందేమిటంటే ఆ గుర్తింపు రావడంతో నాకు మేలే జరిగిందని. ఆ గుర్తింపుని నేను మనస్ఫూర్తిగా స్వీకరించా. అంతిమంగా నేనొక నటిని. దర్శకులు నా పాత్రని ఎలా మలిస్తే అలా నేను ఇమిడిపోతాను. ‘తడమ్’ దర్శకుడు మజిళ్ మజిజ్ తిరుమేని తెరకెక్కిస్తున్న కొత్త చిత్రంలో నేను మేకప్ లేకుండా చాలా సహజమైన పాత్రలో నటిస్తున్నా. ఓ నటిగా నేను అన్ని రకాల పాత్రలు చేయగలను. యాక్షన్ అంటే ఇష్టం. నేను కొన్ని యుద్ధ విద్యలు నేర్చుకున్నాను కూడా. యాక్షన్ ప్రధానమైన పాత్రలో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. ‘హరి హర వీరమల్లు’లో కొన్ని యాక్షన్ ఘట్టాల్లో కనిపిస్తా. నా కెరీర్లో ఓ అత్యుత్తమమైన పాత్ర ఆ సినిమాలోనే ఉండటం ఎంతో ప్రత్యేకం’’.
* గతేడాదంతా నటిస్తూనే ఉన్నా. ఈ ఏడాది వరుసగా నా సినిమాలు విడుదల కాబోతున్నాయి. ‘హీరో’, ‘హరి హర వీరమల్లు’ తర్వాత తెలుగులో కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోలేదు. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఏప్రిల్ నుంచి హిందీలో ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో ఉదయనిధి స్టాలిన్‌తో చేసిన సినిమా త్వరలోనే విడుదలదవుతుంది. మరికొన్ని కొత్త చిత్రాలకి ఓకే చెప్పా. అబ్బాయిల విషయంలో ఒకొక్కరికీ ఒక్కో కల ఉంటుంది. నాకు మాత్రం గౌరవించే వ్యక్తులంటే ఇష్టం. నన్నే కాదు, చుట్టుపక్కల అందరితోనూ గౌరవభావంతో ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మా నాన్నలా ఉండాలి’’.
‘‘అగ్ర తారలతోనే కలిసి నటించాలనేమీ లేదు. మంచి కథలు, తారలతో సినిమాలు... ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రయాణం చేసుకోవాలి. ముఖ్యంగా మంచి కథలని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు. అందుకే ‘హీరో’ గురించి శ్రీరామ్ ఆదిత్య నుంచి పిలుపు రాగానే వెళ్లి కథ విన్నా. స్క్రిప్ట్ ఆసక్తికరంగా అనిపించింది. భిన్నమైన కథ, అదే సమయంలో వాణిజ్య సూత్రాలతో కూడుకుని ఉంటుంది. ఇందులో డార్క్ కామెడీ కూడా ఉంటుంది. కథ విన్న వెంటనే సినిమా చేయడానికి ఒప్పుకున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్‌హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్‌ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్‌చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్‌నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్‌తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్‌పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్‌లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్‌మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్‌కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్‌నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..