Nidhi agarwal: అందుకే వెబ్‌సైట్‌

‘అందాల నిధినే కాదు... ఆదుకొనే మనసునూ అంటోంది’ కథానాయిక నిధి అగర్వాల్‌. కొవిడ్‌ రెండో వేవ్‌లో తను ఎంతో మందికి సాయం చేస్తోంది. ఆహారం, మందులు, వైద్యం... అందేలా ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఇంత కాలం సోషల్‌మీడియా

Updated : 27 May 2021 06:05 IST

‘అందాల నిధినే కాదు... ఆదుకొనే మనసునూ అంటోంది’ కథానాయిక నిధి అగర్వాల్‌. కొవిడ్‌ రెండో వేవ్‌లో తను ఎంతో మందికి సాయం చేస్తోంది. ఆహారం, మందులు, వైద్యం... అందేలా ఏర్పాట్లు చేస్తోంది. వీటిని ఇంత కాలం సోషల్‌మీడియా వేదికగా చేస్తూ వచ్చిన నిధి... ప్రస్తుతం సొంతంగా ఒక వెబ్‌సైట్‌ రూపకల్పన చేయాలనుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘‘ఈసారి కొవిడ్‌తో ప్రతి రోజూ ఎవరో ఒకరు ఆత్మీయులను కోల్పోతూనే ఉన్నారు. ఇవన్నీ నన్ను కదిలించాయి. అందుకే వీరికి సాయం చేయడానికి కొంతమంది యువ సామాజిక కార్యకర్తలతో కలిసి ఒక వెబ్‌సైట్‌ రూపొందిస్తున్నాం. ఇన్‌స్టా, ట్విటర్లలో కామెంట్‌ బాక్స్‌లో తమ సమస్యను వివరించేవారు బాధితులు. వారిని కనిపెట్టి, వారి చిరునమా కనుక్కొని సాయం చేయడం కష్టంగా ఉండేది. అందుకే వెబ్‌సైట్‌ అందుబాటులోకి తేవాలనుకున్నాం. అందులో సమస్యతో పాటు... చిరునామా, ఫోన్‌నంబర్‌ తదితర వివరాలు నమోదు చేసే వెసులుబాటు ఉంటుంది. దీనివల్ల బాధితులకు సత్వర సాయం అందివ్వొచ్చు. ప్రస్తుతానికి దీన్ని కరోనా బాధితుల కోసమే తెస్తున్నాం’’ అని చెప్పు   కొచ్చింది నిధి. ఈమె తమిళంలో ‘ఈశ్వరన్‌’, ‘భూమి’ చిత్రాలు చేసింది.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు