Nidhhi Agerwal:  కొవిడ్ వేళ అండ‌గా నిలుస్తోంది

కొవిడ్ సంక్షోభం వేళ‌ ఇప్ప‌టికే ఎంద‌రో న‌టులు త‌మ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో మీకు తోడుగా మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. ఇప్పుడా జాబితాలో నిలుస్తోంది యువ నాయిక నిధి అగ‌ర్వాల్‌.

Published : 26 May 2021 23:15 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: కొవిడ్ సంక్షోభం వేళ‌ ఇప్ప‌టికే ఎంద‌రో న‌టులు త‌మ సేవాగుణాన్ని చాటుకున్నారు. ఈ క్లిష్ట స‌మ‌యంలో మీకు తోడుగా మేమున్నాం అంటూ ముందుకొచ్చారు. ఇప్పుడా జాబితాలో నిలుస్తోంది యువ నాయిక నిధి అగ‌ర్వాల్‌. కొవిడ్‌తో పోరాడుతున్న వారికి త‌న‌వంతు సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకుని స్వ‌చ్ఛంధ సంస్థ‌ని ప్రారంభించింది. దీని ద్వారా అవ‌స‌ర‌మైన వారికి నిత్యావ‌స‌రాలు,  మందులు అందించ‌నున్న‌ట్టు తెలియ‌జేసింది. సంబంధిత‌  వెబ్‌సైట్‌ https://distributelove.orgలో వివ‌రాలు న‌మోదు చేసుకోవాల‌ని కోరింది. సినిమా విష‌యానికొస్తే.. ప‌వ‌న్ కల్యాణ్ స‌ర‌స‌న ‘హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు’ చిత్రంలో న‌టిస్తోంది నిధి. ద‌ర్శ‌కుడు క్రిష్ తెర‌కెక్కిస్తోన్న చిత్ర‌మిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని