Anasuya: దీపికా పదుకొణెగా అనసూయ.. రణ్‌వీర్‌ సింగ్‌గా నిఖిల్‌

బుల్లితెర సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో యాంకర్‌గా సోషల్‌మీడియాలో ఫేమ్‌ సొంతం చేసుకున్నారు నిఖిల్‌ (Nikhil) విజయేంద్రసింహా. ప్రస్తుతం స్టార్‌హీరో హీరోయిన్స్‌ని స్పెషల్‌ ఇంటర్వ్యూలు....

Updated : 25 Sep 2022 13:25 IST

హైదరాబాద్‌: బుల్లితెర సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో యాంకర్‌గా సోషల్‌మీడియాలో ఫేమ్‌ సొంతం చేసుకున్నారు నిఖిల్‌ (Nikhil) విజయేంద్రసింహా. ప్రస్తుతం స్టార్‌హీరో హీరోయిన్లనూ స్పెషల్‌ ఇంటర్వ్యూలు చేస్తూ నెటిజన్లను అలరిస్తోన్న నిఖిల్‌ ఇటీవల తన పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో జరుపుకొన్నారు. నిహారిక - చైతన్య, అనసూయ - భరద్వాజ్‌ దంపతులతోపాటు బుల్లితెర నటీనటులు పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు.

పార్టీలో భాగంగా సెలబ్రిటీలందరూ ‘బాలీవుడ్‌’ థీమ్‌ని ఫాలో అయి.. ఫేమస్‌ చిత్రాల్లోని గెటప్స్‌ని రీక్రియేట్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోని నిఖిల్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశాడు. ఇందులో నిహారిక.. ‘గంగూబాయి కతియావాడి’లోని అలియాభట్‌ లుక్‌ని రీ క్రియేట్‌ చేయగా.. ఆమె భర్త చైతన్య అమితాబ్‌ బచ్చన్‌ లుక్‌లో మెప్పించారు. ఇక, అనసూయ, ఆమె భర్త భరద్వాజ్‌.. ‘యే జవానీ హై దివానీ’లోని దీపికా పదుకొణె, రణ్‌బీర్‌ లుక్స్‌లో మెరిశారు. ఇక, బర్త్‌డే బాయ్‌ నిఖిల్‌.. ‘రామ్‌లీలా’లోని రణ్‌వీర్‌ సింగ్‌లా, ‘మహాతల్లి’ ఫేమ్‌ జాన్వి.. అలియాభట్‌లా అదరగొట్టేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఆకట్టుకుంటోంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని