Niharika: నిహారిక భర్త న్యూసెన్స్‌ కేసు ఏమైందంటే..!

మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. అపార్ట్‌మెంట్‌లో

Updated : 05 Aug 2021 20:40 IST

హైదరాబాద్‌: మెగా డాటర్ నిహారిక భర్త చైతన్య న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. అపార్ట్‌మెంట్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమైన దృశ్యాల ఆధారంగా పోలీసులు ఇరువర్గాలకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడంతో రాజీపడ్డారు. ఇక మీదట  ఎలాంటి అభ్యంతరాలు ఎదురుకాకుండా చూసుకుంటామని ఇరువర్గాలు పోలీసుల ఎదుట ఒప్పందం చేసకున్నారు.

బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను చైతన్య అద్దెకు తీసుకున్నారు. అయితే అపార్టుమెంట్‌లో ఆఫీస్ పెట్టటానికి వీలు లేదని అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చైతన్యకు, అపార్టుమెంట్ వాసులకు మధ్య గొడవ జరిగింది. తమ ఆఫీస్‌లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ అపార్ట్‌మెంట్‌‌లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు. గత కొన్ని రోజులుగా నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని, వచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి నానా హంగామా సృష్టిస్తున్నారని అపార్టుమెంట్‌ వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం జరిగిన వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీను పోలీసులు సేకరించారు. ఇరువురినీ స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఇరువర్గాలూ రాజీకి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.

గొడవపై క్లారిటీ ఇచ్చిన చైతన్య
అపార్ట్‌మెంట్‌లో జరిగిన గొడవపై నిహారిక భర్త చైతన్య క్లారిటీ ఇచ్చారు. ‘‘ ముందుగా నేనే పోలీసులకు ఫిర్యాదు చేశా. కానీ, మీడియాలో మొదట నాపై కేసు నమోదైనట్టు వచ్చింది. 25 మంది వచ్చి మా తలుపు తట్టడంతో  పోలీసులకు ఫిర్యాదు చేశాను. అపార్ట్‌మెంట్‌ ఎందుకు అద్దెకు తీసుకున్నానో యజమానికి ముందే చెప్పాను. ఆ విషయంపై అపార్ట్‌మెంట్‌ వాసులకు క్లారిటీ లేకపోవడంతో గొడవ జరిగింది. దీనిపై ఇరువురం చర్చించుకున్నాం’’ అని చైతన్య వివరించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని