Niharika Konidela: అల్లు అర్జున్‌ను అన్‌ఫాలో చేసిన మెగా హీరో.. నిహారిక ఏమన్నారంటే?

అల్లు అర్జున్‌ను ఓ మెగా హీరో అన్‌ఫాలో చేసినట్టు జరిగిన ప్రచారంపై నిహారిక స్పందించారు.

Updated : 15 Jun 2024 16:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తన కుటుంబ సభ్యుడు, నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) సోషల్‌ మీడియా ఖాతాలను ఓ మెగా హీరో అన్‌ఫాలో చేశారంటూ ఇటీవల ప్రచారం జరిగింది. బన్నీతోపాటు ఆయన కుటుంబ సభ్యులనూ అన్‌ఫాలో అయ్యారని నెట్టింట చర్చ సాగింది. ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu) టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరైన నిహారిక (Niharika Konidela)ను ఇదే విషయమై ఓ విలేకరి ప్రశ్నించగా ఆమె స్పందించారు. దాని గురించి తనకు తెలియదన్నారు. ఎవరి కారణాలు వారికి ఉంటాయని చెప్పారు.

‘కన్నప్ప’ను కృష్ణంరాజు ప్రభాస్‌తో చేద్దామనుకున్నారు.. కానీ: మోహన్‌బాబు

చాలామంది కొత్త నటులతో యదు వంశీ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘కమిటీ కుర్రోళ్లు’. నిహారిక కొణిదెల సమర్పణలో పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మిస్తున్నారు. టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించారు. ‘‘మేమంతా ఓ ఫ్యామిలీలా కష్టపడి సినిమాను తీశాం. త్వరలోనే ట్రైలర్ వస్తుంది. వంశీ కథ చెప్పే సమయంలో పదకొండు మంది జీవితాల్ని చూసినట్టుగా అనిపించింది. విజువల్‌గా సినిమా ఎలా ఉంటుందో అర్థమైంది. ఇందులోని ఎమోషన్స్‌ అందరికీ కనెక్ట్‌ అవుతాయి’’ అని అన్నారు. ‘‘ఈ చిత్రంతో 11 మంది గొప్ప ఆర్టిస్టులను పరిచయం చేయబోతున్నాం. వారు నటించలేదు.. జీవించారు’’ అని దర్శకుడు వంశీ కొనియాడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని