నిహారిక-చైతన్య పెళ్లి ముహూర్తం ఖరారు

మెగా వారసురాలు నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసే తేదీ ఖరారైంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రభాకర రావు....

Updated : 08 Dec 2022 14:15 IST

ఉదయ్‌ విలాస్‌ వేదిక

హైదరాబాద్‌: మెగా వారసురాలు నిహారిక కొణిదెల మెడలో చైతన్య జొన్నగడ్డ మూడు ముళ్లు వేసే తేదీ ఖరారైంది. డిసెంబరు 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసినట్లు వరుడి తండ్రి, గుంటూరు ఐజీ జె. ప్రభాకర్‌ రావు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ప్రభాకర రావు దంపతులు స్వామి వారి సేవలో పాల్గొన్నారు. వివాహ పత్రికను స్వామి వారి చెంత ఉంచి, ఆశీర్వచనం తీసుకున్న అనంతరం వివాహ వేదిక, సమయాన్ని ప్రకటించారు. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఉదయపూర్‌లో ఉన్న ఉదయ్ విలాస్‌ను వివాహ వేదికగా ఖరారు చేసినట్లు చెప్పారు.

ఆగస్టులో నిహారిక-చైతన్యల నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. మెగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన వేడుక ఫొటోలు ఆకట్టుకున్నాయి. నిహారిక ఇంట్లో పసుపు కొట్టే శుభకార్యం కూడా నిర్వహించారు. ఇటీవల నిహారిక తన స్నేహితుల కోసం బ్యాచిలరేట్‌ పార్టీ కూడా ఏర్పాటు చేశారు. దీని కోసం వారితో కలిసి ప్రత్యేకంగా గోవా వెళ్లి వచ్చారు. నిశ్చితార్థం జరిగిన తర్వాత నుంచి నిహారిక, చైతన్య సోషల్‌మీడియా వేదికగా ఒకరిపై మరొకరి ప్రేమను తెలుపుతూనే ఉన్నారు.

చైతన్య హైదరాబాద్‌లోనే పుట్టి, పెరిగారు. జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యా భవన్‌లో పాఠశాల విద్యను పూర్తి చేశారు. బిట్స్ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమెటిక్స్‌ చేశారు. ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎంబీఏ చదివారు. ఆయన హైదరాబాద్‌లోని ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా పనిచేస్తున్నారు. అంతేకాదు ఆయనకు ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టమట.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని