Niharika: ‘పుష్ప’ టు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. సిగ్నేచర్‌ స్టెప్పులతో అదరగొట్టేసిన నిహారిక

వివాహం తర్వాత సినిమాలకు దూరమయ్యారు నటుడు నాగబాబు కుమార్తె, నటి నిహారిక. నటిగా వెండితెరకు దూరమైనప్పటికీ నిర్మాతగా..

Updated : 08 Dec 2022 16:16 IST

హైదరాబాద్‌: వివాహం తర్వాత సినిమాలకు దూరమైన నటి నిహారిక.. నిర్మాతగా పలు వెబ్‌ సిరీస్‌లు నిర్మిస్తూ ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వర్క్‌ లైఫ్‌తోపాటు భర్త, కుటుంబం, స్నేహితులతో సమయాన్ని గడుపుతూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

తాజాగా ఈ భామ తన డ్యాన్స్‌తో నెటిజన్లను ఫిదా చేశారు. తన స్నేహితురాలు, కొరియోగ్రాఫర్‌ మృణాలి కిరణ్‌తో కలిసి ఇటీవల విడుదలైన చిత్రాల్లోని ఫేమస్‌ పాటలకు సిగ్నేచర్‌ స్టెప్పులు రీ క్రియేట్‌ చేశారు. ‘పుష్ప’ నుంచి ‘సామీ’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి ‘నాటు నాటు’, ‘ది వారియర్‌’ నుంచి ‘కమాన్‌ బేబీ‌’ వంటి పాటలకు వీరిద్దరూ డ్యాన్స్‌ చేసి అలరించారు. ఇన్‌స్టాలో ఈ వీడియో షేర్‌ చేసిన నిహారిక.. ‘‘టాలెంటెడ్‌ మృణాలితో ఇలా మొదటిసారి డ్యాన్స్‌ చేస్తున్నా. ఈ వీడియో షూట్‌ ఫుల్‌ ఫన్నీగా ఉంది’’ అని రాసుకొచ్చింది. మరో వీడియోలో తన తండ్రి నాగబాబుకు నిహారిక ట్రీట్‌మెంట్‌ చేస్తున్నట్లు కనిపించారు. గాయం కావడంతో నాగబాబు తన చేతికి బ్యాండ్‌ వేసుకోగా.. ఆ చేతి నొప్పిని తగ్గిస్తానంటూ నిహారిక సరదాగా ట్రీట్‌మెంట్‌ చేశారు. ఈ సరదా వీడియోని నాగబాబు షేర్‌ చేస్తూ.. ‘‘ముల్లును ముల్లుతోనే తీయాలి అంటే ఇదేనేమో.. మీరు దీన్ని ప్రయత్నించకండి. నిపుణురాలైన నిహారిక పర్యవేక్షణలో ఇది జరిగింది’’ అని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని