Niharika: ‘ఒక మనసు’ నాకిష్టం లేదు.. దాన్ని మళ్లీ చూడాలని లేదు: నిహారిక

తాను నటిగా వెండితెరకు పరిచయమైన ‘ఒక మనసు’ (Oka Manasu) సినిమా అంటే తనకిష్టం లేదని నటి నిహారిక (Niharika) వెల్లడించారు. ఆ సినిమాని మళ్లీ చూడాలనుకోవడం లేదంటూ...

Published : 27 Jul 2022 18:35 IST

హైదరాబాద్‌: తాను నటిగా వెండితెరకు పరిచయమైన ‘ఒక మనసు’ (Oka Manasu) సినిమా అంటే తనకిష్టం లేదని నటి నిహారిక (Niharika) వెల్లడించారు. ఆ సినిమాని మళ్లీ చూడాలనుకోవడం లేదంటూ ఆమె షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. తన భర్త చైతన్య జొన్నలగడ్డతో (Chaitanya) కలిసి ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె తన రీల్‌, రియల్‌ లైఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘చైతన్య నేనూ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అందరూ అనుకుంటున్నారు. అందులో ఎలాంటి నిజం లేదు. మాది పూర్తిగా పెద్దలు కుదిర్చిన వివాహమే. 2019లోనే మా పెళ్లి చూపులు జరిగాయి. మొదటిసారి చైతన్యని కలిసింది అప్పుడే. 2020లో మా బంధం మొదలైంది. తను పైకి సైలెంట్‌గా ఉంటారు కానీ, ఎంతో సరదా మనిషి. మా ఇద్దరి మధ్య ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు వస్తే ముందు తనే సారీ చెబుతాడు’’ అని నిహారిక తెలిపారు. అనంతరం విలేకరి.. ‘‘నిహారిక నటించిన సినిమాల్లో ఆమెకు అస్సలు ఇష్టం లేని సినిమా ఏది?’’ అని అడగ్గా.. ‘‘నాకు తెలిసినంత వరకూ తనకి ‘హ్యాపీ వెడ్డింగ్‌’ అంటే ఇష్టం ఉండదు’’ అని చైతన్య సమాధానమిచ్చారు. దానిపై నిహారిక మాట్లాడుతూ.. ‘‘హ్యాపీ వెడ్డింగ్‌’ అంటే ఇష్టం లేదనే మాట వాస్తవమే. దానితోపాటు నా మొదటి సినిమా ‘ఒక మనసు’ అంటే కూడా నాకు నచ్చదు. తెరంగేట్రం చేసినప్పుడు అందరిలాగే నాక్కూడా కొత్తగా అనిపించింది. కానీ, తర్వాత నాకెందుకో అది నచ్చలేదు. మళ్లీ ఆ సినిమా చూడాలని లేదు. అందులోని పాత్ర నా వ్యక్తిగత జీవితానికి చాలా దూరంగా ఉంటుంది’’ అని నిహారిక వివరించారు. ఇదే ఇంటర్వ్యూలో చైతన్య సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారంటూ జరుగుతోన్న ప్రచారానికి ఈ జోడీ ఫుల్‌స్టాప్‌ పెట్టింది. అవన్నీ అవాస్తవాలు మాత్రమేనని చెప్పింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని