నిహారిక-చైతన్య వివాహం: చిరు అపురూప చిత్రం

‘మెగా’ డాటర్‌ నిహారిక-చైతన్యల వివాహ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు ఇప్పటికే ఉదయ్‌పూర్‌

Updated : 08 Dec 2020 14:16 IST

హైదరాబాద్‌: ‘మెగా’ డాటర్‌ నిహారిక-చైతన్యల వివాహ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇరు కుటుంబాలు ఇప్పటికే ఉదయ్‌పూర్‌ చేరుకున్నాయి. సోమవారం రాత్రి జరిగిన సంగీత్‌ వేడుకలో నిహారిక-చైతన్యలతో పాటు మెగా కుటుంబ సభ్యులు సందడి చేశారు. కాబోయే వధూవరులు పలు పాటలకు నృత్యాలు చేశారు. ముఖ్యంగా చిరంజీవి నటించిన చిత్రాల్లోని పాటలకు స్టెప్‌లు వేస్తూ తమదైన శైలిలో అలరించారు.

ఈ సందర్భంగా చిరంజీవి ఓ అపురూప చిత్రాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు నిహారికను ఎత్తుకున్న ఫొటోతో పాటు, ఇటీవల పెళ్లి కుమార్తెను చేసిన తర్వాత దిగిన సెల్ఫీని కలిపి ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు.

‘‘మా చేతిలో పెరిగిన మా చిన్నారి నిహారికని, చైతన్య చేతిలో పెడుతున్న ఈ శుభ తరుణంలో, కాబోయే  దంపతులకు ముందస్తుగా నా శుభాకాంక్షలు. ఆశీస్సులు’’ ట్విటర్‌లో చిరంజీవి

డిసెంబర్‌ 9న గుంటూరు మాజీ ఐజీ జె.ప్రభాకర్‌రావు కుమారుడు చైతన్య.. నాగబాబు తనయ నిహారికను మనువాడబోతున్నారు. రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఈ శుభకార్యం నిర్వహించనున్నారు.  రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌విలాస్‌ ఈ కార్యక్రమానికి వేదిక కాబోతుంది.  

ఇవీ చదవండి..
పెదనాన్న.. ముద్దుల కూతురు.. ఓ సెల్ఫీ

నిహారిక పెళ్లి.. నాగబాబు భావోద్వేగం..!



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని