Sandeep Reddy: ‘అప్పుడు చిరంజీవికి ఏం కాలేదు కదా’ అని బదులిచ్చేవాణ్ని: సందీప్‌రెడ్డి

స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌ షో ‘నిజం’ (Nijam). సోనీలివ్‌ వేదికగా ప్రసారమవుతోన్న ఈ షోలో తాజాగా ప్రముఖ దర్శకులు సందీప్‌ రెడ్డి వంగా, దేవ కట్టా సందడి చేశారు.

Updated : 16 Mar 2023 12:05 IST

హైదరాబాద్‌: గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam) కార్యక్రమంలో దర్శకులు దేవ కట్టా (Dev Katta), సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) సందడి చేశారు. తమ కెరీర్‌ ఎలా మొదలైంది? ఎదుర్కొన్న అవమానాలు? ఇలాంటి ఎన్నో విషయాలపై వీరిద్దరూ మాట్లాడారు. శుక్రవారం ప్రసారం కానున్న ఈ ఎపిసోడ్‌ ప్రోమో తాజాగా విడుదలైంది.

దేవ కట్టా (Dev Katta) మాట్లాడుతూ.. ‘‘నేను చెన్నైలో పుట్టి పెరిగాను. మణిరత్నం, భారతీరాజా, బాలచందర్‌ తెరకెక్కించిన సినిమాలతోపాటు ‘శివ’ చూసి ఎంతో స్ఫూర్తి పొందాను. అలా సినిమాల వైపు అడుగులు వేశాను’’ అని తెలిపారు. అంతేకాకుండా ‘‘సినిమాల వల్ల సమాజం చెడిపోతోంది. సమాజాన్ని బాగు చేయాల్సిన బాధ్యత సినిమాకు ఉంది’’ అనేది ‘ఓవర్‌ రేటెడ్‌’ చర్చ అని అభిప్రాయపడ్డారు.

అనంతరం సందీప్‌ (Sandeep Reddy Vanga) మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పుడు బంధువుల ఇళ్లకు వెళ్లినప్పుడు నేను చేసే పనులు చూసి.. మా అమ్మకు చెబుతామంటూ  బెదిరించేవాళ్లు. అలాంటప్పుడు ‘ఘరానా మొగుడు’ సినిమా క్లైమాక్స్‌లో చిరంజీవి కూడా మంటల్లోకి దూకారు. అప్పుడు ఆయనకు ఏం కాలేదు కదా’ అని వాళ్లకు సమాధానం ఇచ్చేవాణ్ని’’ అని అన్నారు. అలాగే తాను మొదట్లో కెమెరామెన్‌ కావాలనుకున్నానని సందీప్‌ తన మనసులోని మాటను బయటపెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని