Smita-Gopichand: ప్లేయర్స్ అకాడమీ వదిలి వెళ్లి పోవడంపై పుల్లెల గోపీచంద్ ఏమన్నారంటే..?
స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం’ (Nijam) కార్యక్రమం సోనీలివ్ వేదికగా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటికే చిరంజీవి, నాని, రానా, చంద్రబాబు నాయుడు వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తాజాగా సుధీర్ బాబు (Sudheer Babu), గోపీచంద్ (Gopichand) సందడి చేశారు.
హైదరాబాద్: ప్రముఖ గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘నిజం విత్ స్మిత’ (Nijam) కార్యక్రమంలో నటుడు సుధీర్‌బాబు (Sudheer Babu), ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ (Gopichand) సందడి చేశారు. తమ కెరీర్, ఎదురుదెబ్బలు.. ఇలా పలు ఆసక్తికర అంశాలను వీరిద్దరూ పంచుకున్నారు. దీనికి సంబంధించిన తాజా ప్రోమో గురువారం విడుదలైంది. తన వద్ద శిక్షణ పొంది.. పేరుపొందిన టోర్నమెంట్స్‌లో విజేతలుగా నిలిచిన పలువురు క్రీడాకారులు అకాడమీ వదిలి వెళ్లిపోవడంపై గోపీచంద్ ఈ వేదికపై స్పందించారు.
‘‘క్రీడాకారుల జీవితం చిన్న పక్షిలాంటిది. మనం గట్టిగా పట్టుకుంటే అది చచ్చిపోతుంది. అలా కాకుండా సున్నితంగా వదిలేస్తే అది ఎక్కడికైనా ఎగిరిపోతుంది. ఇక్కడ వాటిని జాగ్రత్తగా పట్టుకోవడమే నీ ఉద్యోగం. అలా అయినప్పుడే అవి ఇబ్బందిపడకుండా, ఎక్కడికి ఎగిరిపోకుండా ఉంటాయి’’ అని గోపీచంద్ (Gopichand) వెల్లడించారు. అనంతరం సుధీర్‌బాబు (Sudheer Babu) ధ్యానం చేయడం పై మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికీ నేను దాన్ని ఎందుకు చేయలేకపోతున్నా అని ఆశ్చర్యపోతుంటా. పెళ్లి అనేది ఒక కారణమై ఉండొచ్చు’’ అని నవ్వులు పూయించాడు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
పర్యాటక వీసాతోనూ ఉద్యోగాలకు దరఖాస్తు చేయొచ్చు
-
Politics News
హిమంతను రాహుల్ సరిగా డీల్ చేయలేదు
-
India News
మళ్లీ జాగ్రత్త పడాల్సిందేనా!..140 రోజుల తర్వాత అత్యధిక కొవిడ్ కేసుల నమోదు
-
Politics News
2023 సంవత్సరం.. మార్చి 23వ తేదీ.. 23 ఓట్లు
-
Politics News
శ్రీరాముడు హిందువులకే పరిమితం కాదు: ఫరూక్
-
Sports News
దిల్లీని ఢీకొట్టేదెవరో?.. నేడే ముంబయి-యూపీ ఎలిమినేటర్