Nijam With Smita: సింగర్ స్మితతో ‘నిజం’ చెప్పిన ప్రముఖులు.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే!
సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ కార్యక్రమం రూపొందింది. త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్‌కానుంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ గాయని స్మిత (Smita) వ్యాఖ్యాతగా వ్యవహరించిన తాజా కార్యక్రమం ‘నిజం విత్ స్మిత’ (Nijam With Smita). సినీ, రాజకీయ ప్రముఖులు ఈ షోలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 10 నుంచి ఓటీటీ ‘సోనీలివ్’(SonyLiv)లో ఈ టాక్‌షో స్ట్రీమింగ్‌కానుంది. ఈ వివరాల్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ ప్రోమోను పంచుకున్నారు స్మిత. నటులు చిరంజీవి, రానా, నాని, అడివి శేష్, రాధిక శరత్‌కుమార్, సాయి పల్లవి, దర్శకులు దేవ్ కట్టా, సందీప్‌రెడ్డి వంగా, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు తదితరులు ప్రోమోలో కనిపించారు. చిత్ర పరిశ్రమలో బంధుప్రీతి (నెపొటిజం), నటులపై ధూషణ తదితర అంశాలతో ఈ కార్యక్రమం సీరియస్‌గా రూపొందినట్టు ప్రోమో చూస్తే అర్థమవుతోంది. మరి, ఏ రోజు ఏ సెలబ్రిటీ ఎపిసోడ్ ప్రసారమవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Andhra News: అమర్తలూరు పోలీస్ స్టేషన్లో వైకాపా కార్యకర్తల వీరంగం
-
Crime News
Hyderabad: డేటా చోరీ కేసు.. వినయ్ ల్యాప్‌టాప్‌లో 66.9 కోట్ల మంది సమాచారం
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్