Nikhil: ‘కార్తికేయ 3’పై నిఖిల్‌ ఏమన్నారంటే..?

వైవిధ్య కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో అలరిస్తుంటాడు హీరో నిఖిల్‌. ఈ యంగ్‌ హీరో  చందూ మొండేటి దర్శకత్వంలో నటించిన సినిమా కార్తికేయ2. ఇటీవల విడుదలైన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

Updated : 22 Sep 2022 11:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వైవిధ్యభరిత కథలను ఎంచుకుంటూ వరుస సినిమాలతో అభిమానులను అలరిస్తుంటాడు హీరో నిఖిల్‌. చందూ మొండేటి దర్శకత్వంలో ఈ యంగ్‌ హీరో నటించిన చిత్రం ‘కార్తికేయ2’. ఇటీవల విడుదలైన ఈ సినిమా అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం కార్తికేయ సినిమాకు సీక్వెల్‌గా వచ్చింది. ఈ రెండు సినిమాలకు ప్రేక్షకాదరణ లభించడంతో కార్తికేయ3కు చిత్రబృందం ప్లాన్‌ చేస్తోంది. దీనిపై హీరో నిఖిల్‌ ఓ ఆంగ్ల మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘కార్తికేయ సినిమా రెండు భాగాలూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అందరి దీవెనలతో కార్తికేయ3 తీయనున్నాము. ఈ సినిమా ఎప్పుడు పూర్తిచేస్తామా అని  చాలా ఆత్రుతగా ఉంది. ఎందుకంటే దీనిని 3Dలో రూపొందించనున్నారు’’ అని వెల్లడించారు.

శ్రీకృష్ణ తత్వం, ద్వారకా నగరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో నిఖిల్‌ సరసన అనుపమా పరమేశ్వరన్‌ నటించింది. శ్రీనివాస్‌రెడ్డి, అనుపమ్‌ ఖేర్‌, సత్య, వైవా హర్ష తదితరులు కీలకపాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని