18 Pages: ‘18 పేజెస్‌’ లక్ష్యం.. క్రిస్మస్‌

‘కార్తికేయ2’ విజయంతో జాతీయ స్థాయిలో మెరిశారు కథానాయకుడు నిఖిల్‌. ఇప్పుడాయన ‘18 పేజెస్‌’తో అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు.

Updated : 26 Oct 2022 08:03 IST

‘కార్తికేయ2’ (Karthikeya 2) విజయంతో జాతీయ స్థాయిలో మెరిశారు కథానాయకుడు నిఖిల్‌ (Nikhil). ఇప్పుడాయన ‘18 పేజెస్‌’తో (18 Pages) అలరించేందుకు సిద్ధమవుతున్నారు. సుకుమార్‌ రైటింగ్స్‌, జీఏ2 పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. పల్నాటి సూర్య ప్రతాప్‌ తెరకెక్కిస్తున్నారు. దర్శకుడు సుకుమార్‌ కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభించుకుంది. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు మంగళవారం ట్విటర్‌ వేదికగా తెలియజేశారు. ఈ చిత్రాన్ని డిసెంబరు 23న విడుదల చేయనున్నట్లు తన ట్వీట్‌లో స్పష్టత ఇచ్చారు. యువతరం మెచ్చే కొత్తదనం నిండిన ప్రేమ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. నిఖిల్‌కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) నటిస్తోంది. గోపీ సుందర్‌ స్వరాలందిస్తున్నారు. ఎ.వసంత్‌ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని