Published : 25 Jun 2022 11:50 IST

Nikhil: లైవ్‌ ఈవెంట్‌లో అభిమానికి నిఖిల్‌ సూపర్‌ గిఫ్ట్‌.. ఆ తర్వాత ఏం చేశారంటే..!

హైదరాబాద్‌: నిఖిల్‌ (Nikhil) హీరోగా నటించిన ‘కార్తికేయ-2’ (Karthikeya-2) ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. నిఖిల్‌ కెరీర్‌ ప్రారంభమైన నాటి నుంచి ఆయన నటించిన ప్రతి చిత్రాన్ని తాను చూస్తున్నానని, ఆయనంటే తనకెంతో ఇష్టమని చెప్పిన మహేశ్ అనే అభిమానికి హీరో అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. తనపై అమితమైన ప్రేమను చూపిస్తోన్న ఆ అభిమానిని స్టేజ్‌ పైకి పిలిచి.. తన కళ్లద్దాలను అతనికి గిఫ్ట్‌గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోని ఈవెంట్‌ అనంతరం మహేశ్‌ ట్విటర్‌ వేదికగా షేర్‌ చేయగా దానిపై నిఖిల్‌ స్పందిస్తూ.. ‘‘బ్రో.. ఆ కళ్లద్దాలను జాగ్రత్తగా చూసుకోండి. మీరు నాపై చూపించిన ప్రేమకు నేనిచ్చిన గిఫ్ట్‌ అది’’ అని రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.

నిఖిల్‌-దర్శకుడు చందు మొండేటి(Chandoo Mondeti) కాంబినేషన్‌లో వచ్చిన సూపర్‌ నేచురల్‌ థ్రిల్లర్‌ ‘కార్తికేయ’ (Karthikeya). 2014లో విడుదలైన ఇదే చిత్రానికి సీక్వెల్‌గా ‘కార్తికేయ-2’ (Karthikeya 2) సిద్ధమైంది. అనుపమ పరమేశ్వరన్‌ (Anupama Parameswaran) కథానాయిక. ద్వారకా నగర రహస్యం అనే ఆసక్తికర కథాంశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంది. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌, పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా దీన్ని నిర్మిస్తున్నాయి. జులై 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనుపమ్‌ ఖేర్‌, శ్రీనివాస రెడ్డి, ఆదిత్య మేనన్‌, తులసి, ప్రవీణ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.



Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని