Nikhil: డ‌బ్బు ఉన్నంత మాత్రాన ఏం చేయ‌లేం

‘ఈ క్లిష్ట స‌మ‌యంలో ప‌రిచ‌యాలే కొత్త క‌రెన్సీ’ అని యువ క‌థానాయ‌కుడు నిఖిల్ అన్నారు. కొవిడ్ వేవ్ వ‌ల్ల ఇబ్బందులో ఉన్న ఎంతో మందికి సాయం చేసి ఆదుకున్నారాయ‌న‌.

Published : 07 Jun 2021 01:11 IST

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ‘ఈ క్లిష్ట స‌మ‌యంలో ప‌రిచ‌యాలే కొత్త క‌రెన్సీ’ అంటున్నారు యువ క‌థానాయ‌కుడు నిఖిల్. కొవిడ్ రెండో వేవ్ వ‌ల్ల ఇబ్బందుల్లో ఉన్న ఎంతో మందికి సాయం చేసి ఆదుకున్నారాయ‌న‌. అవ‌స‌ర‌మైన వారికి బెడ్లు, మందులు, ఆహారం స‌కాలంలో అందించి త‌న సేవాగుణం చాటుకున్నారు. ఈ క్ర‌మంలో ఎదురైన‌ అనుభ‌వాల్ని ఇలా పంచుకున్నారు.

‘‘కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన‌పుడు నా సినిమాల చిత్రీక‌ర‌ణ ర‌ద్దు చేసి ఇంట్లోనే ఉన్నాను. మ‌న ప‌రిస్థితి ఓకే. కానీ, ఇంట్లోనే ఉండే సౌక‌ర్యం అందరికీ ఉండ‌దు కదా. వాళ్ల‌కి ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికి నేను చేయ‌గ‌లిగినంత సాయం చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాను. గ‌తేడాదితో పోల్చితే ఈ ఏడాది ప‌రిస్థితి మారింది. చాలామంది ఆసుపత్రిలో చేరాల్సి వస్తోంది. డ‌బ్బు ఉన్నంత మాత్రాన ఏం చేయ‌లేం. బెడ్లు, వెంటిలేట‌ర్లు, యాంటీ ఫంగ‌ల్ మెడిస‌న్‌, ఇంజెక్ష‌న్లు ల‌భించ‌డం చాలా క‌ష్టంతో కూడుకున్న విష‌యం.

‘‘ఈ క్లిష్ట స‌మ‌యంలో ప‌రిచ‌యాలే కొత్త క‌రెన్సీ. సోష‌ల్ మీడియా ద్వారా నేను ఓ ఫార్మా కంపెనీని సంప్ర‌దించ‌గిలిగాను. చీరాల‌, విశాఖ‌పట్నంలో అవ‌స‌ర‌మైన వారికి ఇంజెక్ష‌న్లు ఏర్పాటు చేశాను. సాయం కోసం న‌న్ను ట్యాగ్ చేస్తూ వేల‌కొద్దీ పోస్టులు వ‌చ్చేవి. కానీ, నేను రోజుకి 50 మంది స‌హాయం చేయ‌గ‌లుగుతున్నాను. కొన్ని అభ్య‌ర్థ‌ల్ని నా అభిమానులు స్వీక‌రించ‌డం హృదయాన్ని హ‌త్తుకుంది. ఒక‌రిని ర‌క్షించేందుకు మ‌రొకరు ముందుకు రావ‌డం సంతోష‌క‌ర విష‌యం. శుభ‌వార్త ఏంటంటే.. గ‌త నెల‌కంటే ఈ నెల అభ్య‌ర్థ‌న‌ల సంఖ్య‌ త‌గ్గింది’’ అని పేర్కొన్నారు. ఇక సినిమాల విష‌యానికొస్తే.. ‘18 పేజీస్‌’, ‘కార్తికేయ-2’ చిత్రాలు నిఖిల్ చేతిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని