Cinema News: ఓటమి లేని ప్రేమ

శ్రీకాంత్‌ గుర్రం, బుజ్జి నాయకా నాయికలుగా కె.గోవర్ధనరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్నే చూస్తు’. పోతిరెడ్డి   హేమలతారెడ్డి నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైంది

Updated : 09 May 2022 14:13 IST

శ్రీకాంత్‌ గుర్రం, బుజ్జి నాయకా నాయికలుగా కె.గోవర్ధనరావు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నిన్నే చూస్తు’. పోతిరెడ్డి   హేమలతారెడ్డి నిర్మాత. సెన్సార్‌ కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకి సిద్ధమైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ప్రేమించే మనుషులు, మనసులు ఉన్నంతవరకు ప్రేమ ఎప్పుడూ ఓడిపోదని చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఓ మంచి ప్రేమకథా చిత్రానికి దర్శకత్వం వహించడం ఎంతో తృప్తినిచ్చింది. సుమన్‌, సుహాసిని, భానుచందర్‌, సాయాజీషిండే తదితర సీనియర్‌ నటులతో కలిసి పనిచేయడం మంచి అనుభవం’’ అన్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘ఎన్ని సమస్యలున్నా ప్రేమ ఎప్పుడూ ఓడిపోకూడదనే విషయాన్ని దర్శకుడు చెప్పిన విధానం మనసులకి హత్తుకుంటుంది. కుటుంబమంతా కలిసి చూసేలా ఉంటుందీ  చిత్రం. త్వరలోనే ట్రైలర్‌ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఛాయాగ్రహణం: ఈదర ప్రసాద్‌, సంగీతం: రమణ రాథోడ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని