Sridevi Shoban Babu: సాయిధరమ్‌ తేజ్‌ సర్‌ప్రైజ్‌ .. ‘శ్రీదేవి శోభన్‌బాబు’ గీతం విన్నారా..!

‘పేపర్‌ బాయ్‌’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఏక్‌ మినీ కథ’ సినిమాతో  మెప్పించిన నటుడు సంతోష్‌ శోభన్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’.

Updated : 07 Dec 2022 17:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘పేపర్‌ బాయ్‌’, ‘మంచి రోజులు వచ్చాయి’, ‘ఏక్‌ మినీ కథ’ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన నటుడు సంతోష్‌ శోభన్‌. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘శ్రీదేవి శోభన్‌బాబు’. గౌరి జీ కిషన్‌ కథానాయిక. ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోని తొలి గీతాన్ని సాయిధరమ్‌ తేజ్‌ సోషల్‌ మీడియా వేదికగా శుక్రవారం విడుదల చేశారు. ‘నిన్ను చూశాక’ అంటూ సాగే ఈ పాటను రాకేందు మౌళి రచించగా జునైద్‌ కుమార్‌ ఆలపించారు. కమ్రాన్‌ స్వరాలందించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. విష్ణు ప్రసాద్‌, సుస్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగబాబు, రోహిణి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కూర్పు: శశిధర్‌ రెడ్డి, ఛాయాగ్రహణం: సిద్ధార్థ్‌ రామస్వామి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని