Nithiin: కలెక్టర్‌గా నితిన్‌.. మాస్‌ లుక్‌ అదిరింది!

ఐఏఎస్‌ అధికారి పాత్రలో నితిన్‌ నటిస్తున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాలో ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎన్‌. సిద్ధార్థ్‌రెడ్డిగా కనిపించనున్నారు.

Published : 26 Mar 2022 10:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఏఎస్‌ అధికారి పాత్రలో నితిన్‌ నటిస్తోన్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఈ సినిమాలో ఆయన గుంటూరు జిల్లా కలెక్టర్‌ ఎన్‌. సిద్ధార్థ్‌రెడ్డిగా కనిపించనున్నారు. ఆ క్యారెక్టర్‌కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఇందులో నితిన్‌ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ దుస్తుల్లో సీరియస్‌గా కనిపించారు. ఇది.. ఓ పోరాట సన్నివేశానికి సంబంధించిన దృశ్యమనిపిస్తోంది. ‘మీకు నచ్చే, మీరు మెచ్చే మాస్‌తో వస్తున్నా’ అని నితిన్‌ ట్వీట్‌ చేశారు.

ఈ చిత్రాన్ని రాజకీయ నేపథ్యంలో.. మాస్‌ అంశాలతో తెరకెక్కిస్తున్నారు. నితిన్‌ సరసన కేథరిన్‌ థెరిసా, కృతిశెట్టి సందడి చేయనున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వరసాగర్‌, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల, సంభాషణలు: మామిడాల తిరుపతి, కళ: సాహి సురేశ్‌, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని