Nithiin: డిస్నీ+హాట్‌స్టార్‌లో నితిన్‌ ‘మాస్ట్రో’ స్ట్రీమింగ్‌ ఆ రోజు నుంచే!

maestro: నితిన్‌ కథానాయకుడిగా నటించిన ‘మాస్ట్రో’ సెప్టెంబరు 17 నుంచి డిస్నీ+హాట్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది.

Updated : 28 Aug 2021 21:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌, నభా నటేశ్‌ జంటగా రూపొందిన చిత్రం ‘మ్యాస్ట్రో’. తమన్నా కీలక పాత్ర పోషించారు. మేర్లపాక గాంధీ దర్శకుడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తాజాగా స్ట్రీమింగ్‌ తేదీని చిత్ర బృందం ప్రకటించింది. సెప్టెంబరు 13 నుంచి ‘మాస్ట్రో’ ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు తెలిపింది. ఇటీవల విడుదల చేసిన ట్రైలర్‌ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ‘కళ్లు కనపడకపోతే ఉండే ఇబ్బందులు అందరికీ తెలుసు’ అంటూ నితిన్ చెప్పే డైలాగ్‌తో ప్రారంభమైన ఈ ట్రైలర్‌ ఆద్యంతం అలరించింది. అంధుడిగా నితిన్‌ నటన మెప్పిస్తోంది. మహతి స్వర సాగర్‌ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ఈ చిత్రం హిందీలో విజయవంతమైన ‘అంధాధున్‌’ రీమేక్‌గా రూపొందింది. శ్రేష్ఠ్‌ మూవీస్‌ పతాకంపై సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని