Nithiin: తేదీలోనే మార్పు.. కలెక్టర్‌సాబ్‌ యాక్షన్‌లో కాదు

నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ మరోసారి వాయిదా పడింది.

Updated : 07 Dec 2022 18:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నితిన్‌ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’ మరోసారి వాయిదా పడింది. ఏప్రిల్‌లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శక-నిర్మాతలు సన్నాహాలు చేసినా సాధ్యపడలేదు. అలా జులై 8కి వాయిదా పడింది. తాజాగా మరో కొత్త విడుదల తేదీని తాజాగా ప్రకటించారు. ఆగస్టు 12న ఈ ప్రాజెక్టును రిలీజ్‌ చేస్తున్నట్టు వెల్లడిస్తూ.. ‘డేట్‌లోనే ఛేంజ్‌.. కలెక్టర్‌సాబ్‌ యాక్షన్‌లో కాదు’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టారు. ఈ మేరకు నితిన్‌ కొత్త లుక్‌ను విడుదల చేశారు. ఎమ్‌.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నితిన్‌.. కలెక్టర్‌ సిద్ధార్థ్‌ రెడ్డిగా కనిపించనున్నాడు. కృతిశెట్టి, కేథరిన్‌ కథానాయికలు. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మహతి స్వర సాగర్‌, ఫైట్స్‌: వెంకట్‌, కూర్పు: కోటగిరి  వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: ప్రసాద్‌ మూరెళ్ల. ఈ సినిమాతోపాటు వక్కంతం వంశీ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు నితిన్‌. టైటిల్‌ ఖరారుకాని ఈ సినిమాలో శ్రీలీల కథానాయిక.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని