Nithiin: కొత్త చిత్రానికి శ్రీకారం

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఇప్పుడిది చిత్రీకరణ దశలో ఉండగానే.. మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారాయన. ఇది నితిన్‌కు 32వ సినిమా.

Updated : 04 Apr 2022 13:26 IST

‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాతో సెట్స్‌పై బిజీగా గడుపుతున్నారు కథానాయకుడు నితిన్‌. ఇప్పుడిది చిత్రీకరణ దశలో ఉండగానే.. మరో కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించారాయన. ఇది నితిన్‌కు 32వ సినిమా. వక్కంతం వంశీ తెరకెక్కిస్తున్నారు. సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్‌ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. శ్రీలీల కథానాయిక. ఈ సినిమా ఆదివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తం సన్నివేశానికి పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు క్లాప్‌ కొట్టగా..ఉమేష్‌ గుప్తా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సురేందర్‌ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. నిర్మాతలు ఠాగూర్‌ మధు, సుధాకర్‌ రెడ్డి, నిఖితా రెడ్డి చిత్ర దర్శకుడికి స్క్రిప్ట్‌ అందించారు. ‘‘వాణిజ్యాంశాలు పుష్కలంగా ఉన్న ఓ సరికొత్త కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. నితిన్‌ పూర్తి భిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. ఆయన నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ పూర్తి కాగానే ఈ చిత్రం ప్రారంభమవుతుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకి సంగీతం: హారిస్‌ జయరాజ్‌, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని