Nithiin: నితిన్‌ ఆ స్టైలిష్‌ దర్శకుడితో సినిమా చేయనున్నారా?

స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేయనున్నట్లు టాక్‌

Published : 04 Sep 2021 19:29 IST

హైదరాబాద్‌: జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న యువ కథానాయకుడు నితిన్‌. ఆయన కీలక పాత్రలో నటించిన ‘మ్యాస్ట్రో’ త్వరలోనే డిస్నీ+హాట్‌ స్టార్‌లో స్ట్రీమింగ్‌ కానుంది. మరోవైపు నితిన్‌ తర్వాతి ప్రాజెక్టుల విషయంలో స్పష్టత రావటం లేదు. వక్కంతం వంశీతో ఓ సినిమా చేస్తారని టాక్ వినిపించింది. మరోవైపు ‘పవర్‌పేట’పేరుతో ఓ సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఇవి ఎప్పుడు మొదలవుతాయో తెలియడం లేదు. తాజాగా మరో వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. స్టైలిష్‌ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేయనున్నట్లు టాక్‌. ప్రస్తుతం సురేందర్‌రెడ్డి అఖిల్‌తో ‘ఏజెంట్‌’ చేస్తున్నారు. దీని తర్వాత నితిన్‌తో చిన్న సినిమా చేస్తారని సమాచారం. దీనికి వక్కంతం వంశీ స్క్రిప్ట్‌ అందించనున్నట్లు తెలుస్తోంది. కేవలం మూడు నెలల్లోనే ఈ సినిమా షూట్‌ పూర్తి చేయాలని శ్రేష్ఠ మూవీస్‌ లక్ష్యంగా పెట్టుకుందట. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని