Nithiin: నెగిటివ్‌ కావాలని...

కరోనా బారిన పడి స్వీయ నిర్బంధంలో గడుపుతున్న తన భార్య షాలినికి ప్రముఖ కథానాయకుడు నితిన్‌ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. శుక్రవారం షాలిని పుట్టినరోజు కాగా, ఆమె కరోనాతో స్వీయ నిర్బంధంలో గడుపుతున్నారు. దాంతో

Updated : 08 Jan 2022 07:26 IST


రోనా బారిన పడి స్వీయ నిర్బంధంలో గడుపుతున్న తన భార్య షాలినికి ప్రముఖ కథానాయకుడు నితిన్‌ తనదైన శైలిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. శుక్రవారం షాలిని పుట్టినరోజు కాగా, ఆమె కరోనాతో స్వీయ నిర్బంధంలో గడుపుతున్నారు. దాంతో గురువారం రాత్రి తన భార్య తరఫున నితినే కేక్‌ కట్‌ చేసి, కిటికీలో నుంచి ఆమె చూస్తుండగా కట్‌ చేసిన కేక్‌ని తనే తిని శుభాకాంక్షలు చెప్పారు నితిన్‌. ఆ వీడియోని ట్విటర్‌లో పంచుకుంటూ ‘‘జీవితంలో మొదటిసారి నువ్వు నెగిటివ్‌ కావాలని కోరుకుంటున్నా’’ అని వ్యాఖ్య చేశారు నితిన్‌.


తమన్‌, త్రిషలకు కరోనా

సినీ ప్రముఖులు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. మహేష్‌బాబు, మంచు లక్ష్మితోపాటు పలువురు ఇప్పటికే కరోనాతో ఇంట్లో స్వీయ నిర్బంధంలో గడుపుతున్నారు. తాజాగా సంగీత దర్శకుడు తమన్‌కి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. స్వల్ప లక్షణాలతో పాజిటివ్‌గా ఖరారైందని, మార్గదర్శకాల్ని పాటిస్తున్నానని తెలిపారు.

ప్రముఖ కథానాయిక త్రిషకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు శుక్రవారం ఆమె స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని