
Skylab: ఓటీటీలో ‘స్కైలాబ్’... నిత్యామేనన్ ఏమన్నదంటే?
ఇంటర్నెట్‌డెస్క్: నిత్యామేనన్, సత్యదేవ్, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘స్కైలాబ్’. విశ్వక్ ఖండేరావు దర్శకుడు. గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా సోనీలివ్ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా నటి, నిర్మాత అయిన నిత్యామేనన్ ‘స్కైలాబ్’ ఓటీటీ విడుదలపై స్పందించారు. థియేటర్‌లలో సినిమాకు ఆశించినంత ఆదరణ లభించలేదని ఆమె అభిప్రాయపడ్డారు.
‘‘స్కైలాబ్’ థియేటర్‌లలో విడుదలైన సమయంలో మేము ఒక సమస్య ఎదుర్కొన్నాం. సాధారణంగా ఒక సినిమాకు వచ్చే ప్రేక్షకుల కన్నా తక్కువ మంది థియేటర్‌కు వచ్చారు. ఇలాంటి ప్రయోగాత్మక సినిమాలు చూడటానికి ఇష్టపడే వాళ్లు కూడా థియేటర్‌కు రాలేదు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా ఉన్నాయి. ఏదేమైనా జరిగిన పరిణామాలను అంగీకరించాల్సిందే. దీని గురించి మీరు మాత్రం ఏం చేయగలరు? జీవితం మనకు నచ్చినట్టు ఉండదు కదా! దేన్నీ మనం అంచనా వేయలేం. ఏదైనా జరిగినప్పుడు దాని నుంచి మనం కొత్త విషయాన్ని నేర్చుకోవాలంతే. అది సినిమా అయినా సరే. అదే సమయంలో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవన్న సంగతి కూడా గుర్తు పెట్టుకోవాలి’’ అని నిత్యామేనన్ చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్‌లోనూ కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయని, ఇంకా ఏ సినిమాకు ఓకే చెప్పలేదని అన్నారు. త్వరలోనే మంచి వార్త వింటారని నిత్యామేనన్ తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.