Nithya Menen: అతడు నన్ను ఆరేళ్లుగా వేధిస్తున్నాడు.. 30 నంబర్లు బ్లాక్‌ చేశా: నిత్యామేనన్‌

ప్రేమిస్తున్నానంటూ సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనని సుమారు ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని అన్నారు నటి నిత్యామేనన్‌ (Nithya Menen). గడిచిన కొన్నిరోజుల క్రితం తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై తాజాగా మరోసారి స్పందించిన ఆమె సంతోష్‌...

Updated : 07 Aug 2022 13:58 IST

సినిమా ప్రమోషన్‌లో షాకింగ్‌ కామెంట్స్‌ చేసిన నటి

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రేమిస్తున్నానంటూ సంతోష్‌ వర్కీ అనే వ్యక్తి తనను ఆరేళ్ల నుంచి వేధిస్తున్నాడని నటి నిత్యామేనన్‌ (Nithya Menen) అన్నారు. ఇటీవల తన పెళ్లి గురించి జరిగిన ప్రచారంపై తాజాగా మరోసారి స్పందించిన ఆమె సంతోష్‌పై పలు ఆరోపణలు చేశారు. ‘‘కొన్నిరోజులుగా నా పెళ్లి గురించి నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టడానికి ప్రధాన కారణం సంతోష్‌ వర్కీ అనే యూట్యూబర్‌. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని చెప్పాడు. ఆరోజు నుంచి ఈ వార్తలు వెలువడుతున్నాయి. నిజం చెప్పాలంటే, అతడు దాదాపు ఆరేళ్ల నుంచి నన్నూ, నా కుటుంబాన్నీ వేధిస్తున్నాడు. వేర్వేరు ఫోన్ నంబర్ల నుంచి నాకు ఫోన్లు చేసేవాడు. దాదాపు 30 ఫోన్‌ నంబర్లు బ్లాక్‌ చేశా. నా తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విసిగించేవాడు. దాంతో మా ఇంట్లోవాళ్లు అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఎన్నోసార్లు చెప్పారు. కానీ నేను అలా చేయకుండా క్షమించి వదిలేశా. అతడి మానసిక స్థితి బాగోలేదనుకుంటా.. వదిలేద్దాం అని ఇంట్లో వాళ్లకు చెప్పాను. కానీ అతడింకా మారలేదు. నా పెళ్లి గురించి ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు  చేస్తున్నాడు’’ అని నిత్యామేనన్‌ వివరించారు.

ఇక, నిత్యామేనన్‌ త్వరలోనే ఓ బిజినెస్‌ మ్యాన్‌ని వివాహమాడనున్నారంటూ ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. ఎంతోకాలం నుంచి ఆమె ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో ఉన్నారని వార్తలు వెలువడ్డాయి. అవన్నీ అవాస్తవాలేనంటూ నిత్య ఓ వీడియో సందేశంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాఫ్‌ పెట్టిన విషయం తెలిసిందే. ఇక, ఓ కోలీవుడ్‌ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ఆమె మరోసారి పెళ్లి ప్రచారంపై స్పందిస్తూ తాజా వ్యాఖ్యలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని