Nithyamenon: ప్రెగ్నెన్సీ కిట్‌ గందరగోళం

నిత్యామేనన్‌ ఎలాంటి పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉంటుంది. అంతలా పేరుతెచ్చుకుని దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.

Updated : 29 Oct 2022 08:28 IST

నిత్యామేనన్‌ (Nithya Menon) ఎలాంటి పాత్ర పోషించినా అందులో సహజత్వం ఉంటుంది. అంతలా పేరుతెచ్చుకుని దక్షిణాది ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆమె తాజాగా ప్రెగ్నెన్సీ కిట్‌ ఫొటోను ఇన్‌స్టాలో పంచుకుంది నిత్యామేనన్‌. ఇది చూసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ‘అండ్‌ ది వండర్‌ బిగిన్స్‌’ అంటూ ఆ పోస్ట్‌కు ఓ మహిళ ఎమోజీని కూడా ట్యాగ్‌ చేసింది నిత్య. దీంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నిత్యకు పెళ్లి అయిపోయిందా? ఇదంతా? నిజమా? లేక సినిమా కోసమా? అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. మరో మలయాళ నటి పార్వతి కూడా ఇదే ఫొటో పెట్టడంతో ఇదంతా ఓ సినిమా కోసమే అనే అభిప్రాయానికి వచ్చారు నెటిజన్లు. ఈ ఇద్దరూ నాయికలు కలిసి ఓ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి అంజలీ మేనన్‌ దర్శకత్వం వహిస్తున్నట్లు, ఈ సినిమాకి ‘వండర్‌ ఉమెన్‌’ (Wonder Women) టైటిల్‌ అనుకున్నట్లు మలయాళ చిత్రసీమలో వార్తలు వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని