Nivetha Pethuraj: విష్వక్ దర్శకత్వమంటే మొదట్లో భయపడ్డా!
బలమైన కథలు... పాత్రలతో ప్రయాణం చేస్తున్న కథానాయిక నివేతా పేతురాజ్. తొలిసారి ఆమె తనలోని గ్లామర్ కోణాన్ని ప్రదర్శిస్తూ ‘దాస్ కా ధమ్కీ’ చేశారు. విష్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది.
బలమైన కథలు... పాత్రలతో ప్రయాణం చేస్తున్న కథానాయిక నివేతా పేతురాజ్ (Nivetha Pethuraj). తొలిసారి ఆమె తనలోని గ్లామర్ కోణాన్ని ప్రదర్శిస్తూ ‘దాస్ కా ధమ్కీ’ చేశారు. విష్వక్‌సేన్ కథానాయకుడిగా నటిస్తూ... స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రమిది. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా నివేతా విలేకర్లతో ముచ్చటించింది.
ఇదివరకు మీరు చేసిన సినిమాలో పోలిస్తే ఈ సినిమా ప్రత్యేకత ఏమిటి?
ప్రభుదేవాతో కలిసి తమిళంలో ఓ సినిమా చేస్తున్నప్పుడు నువ్వు తెలుగులో నటిస్తుంటావు కదా, ఇక్కడికెందుకొచ్చావని అడిగారు. అక్కడ హుందాగా సాగే పాత్రలే వస్తున్నాయని చెప్పా. ‘వెళ్లి నువ్వు బాగా డాన్సులు చేసి, ఎక్కువ పారితోషికం తీసుకొచ్చేయ్’ అని చెప్పారు. ‘దాస్ కా ధమ్కీ’ అవకాశం వచ్చిననప్పుడు, ఇందులో గ్లామర్ పాత్ర అని చెప్పినప్పుడు మొదట భయపడ్డా. కానీ ఈ పాత్ర కోసమని బరువు తగ్గి నన్ను నేను కొత్తగా మలుచుకున్నా. సినిమా పూర్తయ్యాక నా కొత్త లుక్, డాన్స్ చేసిన వీడియోలు మా అమ్మకి పంపిస్తే ‘చాలా బాగుంది, ఎందుకు నువ్వు ఇప్పటిదాకా ఇలా చేయలేదు’ అన్నారు.
‘పాగల్’ తర్వాత మళ్లీ విష్వక్‌తో జోడీ కట్టారు. ఈ కథలో ఏం నచ్చింది?
‘దాస్ కా ధమ్కీ’ సినిమాకి కూడా వేరే హీరోయిన్‌ని అనుకున్నారట కానీ, ఉన్నట్టుండి ఆ అవకాశం నా దగ్గరికి వచ్చింది. కథ చెప్పాక నచ్చి చేయడానికి ఒప్పుకున్నా. చివర్లో కథ మారిందని చెప్పారు. చాలా భయమేసింది. అప్పుడు మరోసారి కథ విన్నాక ఇంకా నచ్చింది. అలా ఈ సినిమా ప్రయాణం మొదలైంది.
ఇదివరకు విష్వక్‌ని నటుడిగానే చూశారు. ఈ సినిమాకి నిర్మాత, దర్శకుడు కూడా. ఆయనతో ప్రయాణం ఎలా సాగింది?
హీరోలు నిర్మాణం కూడా చేయడాన్ని నేను చూశా. కానీ విష్వక్ దర్శకత్వం కూడా చేశాడు. ఆరంభంలో నేను చాలా భయపడ్డా. కానీ నాలుగు రోజుల తర్వాత అంతా సాఫీగా సాగుతోందనే అభిప్రాయం కలిగింది. త్రివిక్రమ్ సర్ తర్వాత మళ్లీ ఓ దర్శకుడిలో అంత ఎనర్జీని నేను చూసింది విష్వక్‌లోనే.
ఇక దర్శకత్వం జోలికి వెళ్లొద్దని ఇటీవల వేడుకలో విష్వక్‌కి చెప్పారు ఎన్టీఆర్. ఆ విషయంలో మీ అభిప్రాయమేమిటి?
ఒకవేళ దర్శకత్వం చేయాలనుకుంటే.. మరో హీరోతో సినిమా చేయమని విష్వక్‌కి చెప్పా. బాలకృష్ణలాంటి అగ్ర హీరోతో తను సినిమా చేస్తే బాగుంటుంది. తన దగ్గర చాలా ఆలోచనలు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ సినిమాలంటే పిచ్చి. కమల్‌హాసన్ సర్‌ని లోకేశ్ కనగరాజ్ ఎంత మాస్‌గా చూపించారో, అలా చూపించగలడని నా నమ్మకం. తను అప్పుడప్పుడూ కొన్ని కథలు వినిపిస్తుంటాడు. దర్శకత్వం అంటే నాకూ ఇష్టం కాబట్టి నేను కూడా కొన్ని కథలు చెబుతుంటా (నవ్వుతూ). నిర్మాణంపై మాత్రం నాకు ఆసక్తి లేదు.
రేసింగ్ అంటే ఇష్టం కదా? ఆ నేపథ్యంలో కథలేమైనా విన్నారా?
కొద్దిమంది చెప్పారు. ఆ నేపథ్యంలో సినిమాలు చేయడం చాలా కష్టం. తమిళంలో అజిత్‌లాగా తెలుగులో రేసింగ్‌ని ఇష్టపడే కథానాయకులు చాలామంది ఉన్నారు. ఎన్టీఆర్, నాగచైతన్య... వీళ్లంతా రేసింగ్ గురించి బాగా మాట్లాడుతుంటారు. బయోపిక్ చేయాల్సి వస్తే కల్పనాచావ్లా జీవితం నేపథ్యంలో సినిమా చేయాలనుకుంటా. సౌందర్య అన్నా ఇష్టమే. కానీ సౌందర్య పాత్రకి నిత్యమేనన్ కరెక్ట్ అని నా అభిప్రాయం.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ts-top-news News
Telangana: ఉడుకుతున్న రాష్ట్రం.. గరిష్ఠంగా 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత
-
Ap-top-news News
చింతలపూడి ఏరియా ఆసుపత్రిలో చీకట్లు.. ఉక్కపోతలో రోగులు
-
Sports News
ఆస్ట్రేలియా వికెట్ పడింది.. లబుషేన్ నిద్ర లేచాడు
-
Movies News
ఇలియానా వెబ్‌సిరీస్ అప్పుడే!
-
Sports News
WTC Final: గిల్ అంటే కుర్రాడు.. నీకేమైంది పుజారా..?: రవిశాస్త్రి ఆగ్రహం
-
Movies News
Social Look: మృణాల్ ఠాకూర్ ‘బ్లాక్ అండ్ బోల్డ్’.. అయిషా శర్మ ఆటో జర్నీ!