Dil Raju: 2 వారాలకో సినిమా విడుదల చేస్తే ఏ సమస్యా ఉండదు: దిల్‌రాజు
ఈ సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’సహా అనేక పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ముందుగా ప్రకటించిన తేదీల్లో ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. దీంతో దాదాపు అన్ని చిత్రాల విడుదల విషయంలో భారీ మార్పులు
హైదరాబాద్: ఈ సంక్రాంతి సీజన్లో విడుదల కావాల్సిన ‘ఆర్ఆర్ఆర్’ సహా అనేక పెద్ద సినిమాలు వాయిదా పడిన విషయం తెలిసిందే. కరోనా తీవ్రరూపం దాల్చుతున్న నేపథ్యంలో ముందుగా ప్రకటించిన తేదీల్లో అవి ప్రేక్షకుల ముందుకు రాలేకపోయాయి. దీంతో ఇప్పుడు ఆ సినిమాలన్నీ వేసవి సీజన్‌పై కన్నేశాయి. ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 18 లేదా ఏప్రిల్ 28కి విడుదల కానుంది. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాన్ని ఏప్రిల్ 1న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అదే రోజు మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అలాగే, ‘భీమ్లా నాయక్’, ‘ఎఫ్ 3’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు కూడా వేసవి సీజన్లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో సినిమాల విడుదలలో సమస్యలు తలెత్తుతాయని అందరూ భావిస్తున్నారు. కానీ, ప్రముఖ నిర్మాత దిల్‌రాజు మాత్రం అలాంటిదేమీ ఉండబోదని స్పష్టం చేశారు. తన ప్రణాళికను అమలు చేస్తే పెద్ద సినిమాలన్నీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా వరుసపెట్టి విడుదలవుతాయని చెప్పారు.
‘‘సంక్రాంతి సీజన్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంటుంది. అదే వేసవి సీజన్ దాదాపు 50 రోజులు ఉంటుంది. ప్రతి రెండు వారాలకి ఒక సినిమాను విడుదల చేసినట్లయితే సమస్యలు తలెత్తే అవకాశమే లేదు. అలాగే, ఏ సినిమా కలెక్షన్లకూ గండి పడదు. కాబట్టి పెద్ద సినిమాల విడుదల తేదీలను మేం సులువుగా సర్దుబాటు చేయొచ్చు. దీన్ని టాలీవుడ్ టాప్ హీరోలంతా అర్థం చేసుకుంటారు’’అని దిల్ రాజు చెప్పుకొచ్చారు. త్వరలోనే ఆయన యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్‌తో సమావేశం ఏర్పాటు చేసి విడుదల తేదీల్లో సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. అదే నిజమైతే తెలుగు సినీ అభిమానులకు ఈ వేసవి సీజన్ కనుల విందుగా ఉండనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్‌ను చూడలేదు: మాధవన్
అజయ్‌దేవ్‌గణ్‌తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్‌ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ అన్నారు. తాజాగా కపిల్‌శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్‌డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్‌తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు. -
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్‌పై బిగ్‌బాస్ నటి ఆగ్రహం
తనపై అసభ్యకర కామెంట్ చేసిన వ్యక్తిని ఉద్దేశించి నటి, బిగ్‌బాస్ 5 ఫేమ్ శ్వేతా వర్మ (Swetha Varma) ఆగ్రహం వ్యక్తం చేశారు. -
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
నటుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prasanth Neel) తాజాగా కలిశారు. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమా రానుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్
‘ఆదికేశవ’ నటి అపర్ణాదాస్, ‘మంజుమ్మెల్ బాయ్స్’ నటుడు దీపక్ పరంబోల్ వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్‌లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్‌ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్‌ఖాన్‌తో మోహన్‌లాల్
మోహన్‌లాల్ డ్యాన్స్‌ను షారుక్ ఖాన్ మెచ్చుకున్నారు. షారుక్‌పై మోహన్‌లాల్ ప్రశంసలు కురిపించారు. -
నిర్మాతల నుంచి పవన్‌కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
పవన్‌కల్యాణ్ కథానాయకుడిగా ఇప్పటికే మూడు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయి. మరి ఆయన నిర్మాతల నుంచి తీసుకున్న అప్పు ఎంతో తెలుసా? -
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
గతంలో ఓ ఆడిషన్లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్ హీరోయిన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే? -
మలయాళ సినిమాల హిట్‌కు కారణమిదే: ఫహాద్ ఫాజిల్
మలయాళ చిత్రాలు వరుస విజయాలు అందుకోవడంపై నటుడు ఫహాద్ ఫాజిల్ ఆనందం వ్యక్తంచేశారు. కంటెంట్ కొత్తగా ఉన్న కారణంగా సినిమాలు ప్రేక్షకాదరణ పొందుతున్నాయన్నారు. -
సిబ్బంది పెళ్లిలో సందడి చేసిన విజయ్ దేవరకొండ..
వ్యక్తిగత సిబ్బంది పెళ్లికి వెళ్లి సర్ప్రైజ్ చేశారు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. -
మాధురి దీక్షిత్‌తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
కొంత విరామం తర్వాత ‘హీరామండీ’తో పలకరించేందుకు సిద్ధమయ్యారు నటి మనీషా కొయిరాలా. దీని ప్రమోషన్స్‌లో తన కెరీర్‌కు సంబంధించిన ఓ విషయాన్ని పంచుకున్నారు. -
పెళ్లి పీటలెక్కనున్న యంగ్ హీరోయిన్.. వైరలవుతోన్న హల్దీ ఫొటోలు..
హీరోయిన్ అపర్ణ దాస్ వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్‌పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
మహేశ్‌బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్‌తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్‌కు క్లీన్ చిట్
-
గగనతలంలో ‘అమ్మ’కు సర్ప్రైజ్.. బుడతడి ఐడియా అదుర్స్
-
అవనిగడ్డలో వైకాపా ర్యాలీ.. బాణసంచా పడి తెదేపా కార్యకర్త ఇల్లు దగ్ధం
-
టేకాఫ్ సమయంలో ఊడిన బోయింగ్ విమానం టైరు
-
సొంత అభ్యర్థికి వ్యతిరేకంగా ‘కాంగ్రెస్’ ప్రచారం.. ఎందుకంటే!