మంచి..చెడు..ఆశ.. పోరాటం
అక్కడ మారణహోమం జరిగి ఉంటుంది. ఒకరు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాడు. పక్కన డబ్బు పెట్టె... అక్కడికొచ్చిన ఓ వేటగాడు.. ఆ డబ్బు పెట్టె తీసుకొంటాడు. కొనప్రాణాలతో ఉన్న వ్యక్తి దాహం.. దాహం అంటుంటే పట్టించుకోకుండా....
ప్రేక్షకాలమ్
సినిమా: నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్; భాష: ఇంగ్లీష్; దర్శకత్వం: కోయెన్ బ్రదర్స్; సినిమాటోగ్రఫి: రోజర్ డికెన్స్; తారాగణం: టామీ లీ జోన్స్, జోస్ బ్రోలిన్, జేవియర్ బోర్డెమ్ తదితరులు; విడుదల: 2007; నిడివి: 122 నిమిషాలు; ఎక్కడ చూడొచ్చు: నెట్ ఫ్లిక్స్
అక్కడ మారణహోమం జరిగి ఉంటుంది. ఒకరు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటాడు. పక్కన డబ్బు పెట్టె... అక్కడికొచ్చిన ఓ వేటగాడు.. ఆ డబ్బు పెట్టె తీసుకొంటాడు. కొనప్రాణాలతో ఉన్న వ్యక్తి దాహం.. దాహం అంటుంటే పట్టించుకోకుండా.. డబ్బు తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అయితే అతణ్ని పశ్చాతాపం వెంటాడుతుంది. జంతువులను వేటాడే బోల్ట్ గన్‌తో మనుషులను క్రూరంగా చంపేసే ఓ సైకో కిల్లర్. చంపేముందు ఓ కాయిన్‌తో బొమ్మాబొరుసు వేసి మరీ కిరాతకంగా హతమారుస్తాడు. హాలీవుడ్ సైకోల్లోనే ముఖ్యడైన ఇతను... వేటగాడ్ని, డబ్బు పెట్టెను పట్టుకునేందుకు వెంటాడతాడు. మరి ఆ డబ్బు ఎవరి వశమైంది? వేటగాడు, సైకో కిల్లర్ల మధ్య రసవత్తర యాక్షన్ ఘట్టాలు ఎలా నడిచాయో చూడాలంటే... ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్’ను చూడాల్సిందే.
నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్’ను హాలీవుడ్ దర్శకద్వయం కోయెన్ బ్రదర్స్(జోయేల్ కోయెన్, ఎథాన్ కోయెన్) తెరకెక్కించారు. హింస నేపథ్యంలో కథలు అల్లుకుని చాలా సినిమాలనే తెరకెక్కించారు వీరు. ‘బ్లడ్ సింపుల్’ వారికి మొదటి చిత్రం. ‘రైజింగ్ ఆరిజోనా’, ‘ఫార్గో’ లాంటి చిత్రాల్లో వారి ప్రత్యేక శైలి తెలిసిపోతుంది. అయితే ఈ సినిమాలో ఆ హింస మరింత ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఆంగ్ల రచయిత కార్మక్ మెక్‌కార్తీ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. నేపథ్య సంగీతం లేకుండా సాగే కొన్ని సన్నివేశాలు మౌనంగా భయపెడతాయి. ఈ చిత్రం మొత్తం నాలుగు అకాడమీ అవార్డులు గెలుచుకుంది. ఉత్తమ చిత్రం, దర్శకుడు, సహాయ నటుడు, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో ఆస్కార్‌లు సొంతం చేసుకుంది. సైకో కిల్లర్‌గా నటించిన జేవియర్ బార్డెమ్‌కు మంచి ప్రశంసలు దక్కాయి. పోలీసు ఆఫీసర్‌గా టామీ లీ జోన్స్, వేటగాడిగా జోస్ బ్రోలిన్, సైకో కిల్లర్‌గా జేవియర్ బోర్డెమ్‌లు అదిరిపోయేలా నటించి సినిమాకు ప్రాణం పోశారు.
కథ: జింకలను వేటాడేందుకు టెక్సాస్ ఎడారిలోకి వెళ్తాడు మోస్ అనే వేటగాడు. అక్కడే కొంత మంది మాదక ద్రవ్యాలు డీల్‌లో భాగంగా కాల్చుకుని చనిపోతారు. శవాలు చెల్లాచెదురుగా పడిఉంటాయి. మారణహోమం జరిగిన ఆ ప్రాంతానికి వెళ్లి చూస్తే అక్కడ మోస్‌కి 2 మిలియన్ డాలర్ల డబ్బున్న ఒక పెట్టె కనిపిస్తుంది. ఆ పెట్టెతో ఇంటికొచ్చాక అక్కడ కొనప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న వ్యక్తి నీళ్లు అడిగితే ఇవ్వలేనందుకు బాధకలుగుతుంది. నీళ్ల డబ్బాతో కార్‌లో తిరిగి అక్కడికి వెళ్తాడు. అప్పటికే అక్కడ కాచుకుని ఉన్న ఇద్దరు దాడికి దిగుతారు. నదిలోకి దూకి తప్పించుకుంటాడు. వీళ్లు తనను వదిలిపెట్టరనే ఉద్దేశంతో భార్యను పుట్టింటికి పంపించి, తను వేరే దిశలో పెట్టె పట్టుకుని బయలుదేరతాడు. ఈ డబ్బును, ఆ వేటగాడిని పట్టుకొనే పనిని ఓ సైకో కిల్లర్‌కు అప్పగిస్తారు. అతడి పేరు ఆంటోని చిగుర్. కిరాతకమైన నరహంతకుడు. ఇతను మోస్‌ను పట్టుకునేందుకు ప్రయత్నంచడం, అతడు తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేయడం, ఎదురుదాడికి దిగడం... ఇలా ఛేజింగ్ ఆసక్తికరంగా సాగుతుంది. రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్న పోలీసాఫీసర్ టామ్ బెల్ వీరిని అనుసరిస్తూ వెళ్తాడు. సైకో కిల్లర్ చేతికి మోస్ చిక్కాడా? లేడా? అంత డబ్బు ఎవరి వశమైంది..? అనేది సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందే.
మనిషి నిర్ణయాలు, ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ప్రపంచం తన పని చేసుకుపోతుందని, గతంలో మనం చేసిన పనుల మీదే భవిష్యత్తు ఆధారపడుతుందని సినిమాలోని పాత్రల ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. అలాగే చెడుపై మంచి గెలిచినట్లుగా చూపించి సినిమాటిక్‌గా ముగించలేదీ కథను. అందుకే వాస్తవ ప్రపంచానికి, మానవ నైజానికి అతి దగ్గరగా ఉండి రియలిస్టిక్‌గా అనిపిస్తుంది. ఈ కథలో టామ్ బెల్ అనే పోలీస్ అధికారి మంచికి, ఆంటోని చిగుర్ చెడుకి, వేటగాడు మోస్ ఆశకు ప్రతిబింబాలుగా చూపిస్తారు దర్శకులు. ఆ దశాబ్దంలో విడుదలైన సినిమాల్లో ఉత్తమమైందిగా ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మ్యాన్’ని చెప్పుకొంటారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Stalin: బుల్లెట్ రైలులో సీఎం స్టాలిన్.. రెండున్నర గంటల్లో 500కి.మీల ప్రయాణం!
-
Movies News
The Kerala Story: వాళ్ల కామెంట్స్‌కు కారణమదే.. కమల్‌హాసన్ వ్యాఖ్యలపై దర్శకుడు రియాక్షన్
-
General News
TSPSC Paper Leak Case: సిట్ అధికారుల దర్యాప్తు ముమ్మరం.. ఐటీ ఉద్యోగి అరెస్టు
-
World News
Cosmetic Surgeries: సౌందర్య చికిత్సతో ఫంగల్ మెనింజైటిస్.. కలవరపెడుతున్న మరణాలు
-
Politics News
PM Modi: భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలతో అధిష్ఠానం కీలక భేటీ
-
World News
Graduation Day: విద్యార్థులకు బిలియనీర్ సర్ప్రైజ్ గిఫ్ట్.. కారణమిదే!