Nayanthara: విరామం లేకుండా ‘కనెక్ట్‌’ చేయడానికి

నయనతార నుంచి రాబోతున్న మరో హారర్‌ చిత్రం ‘కనెక్ట్‌’. ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని అశ్విన్‌ శరవణన్‌ తెరకెక్కించారు.

Updated : 01 Dec 2022 11:21 IST

యనతార (Nayanthara) నుంచి రాబోతున్న మరో హారర్‌ చిత్రం ‘కనెక్ట్‌’ (Connect). ఆమె భర్త విఘ్నేశ్‌ శివన్‌ నిర్మిస్తున్న ఈ సినిమాని అశ్విన్‌ శరవణన్‌ తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమాని ఈ నెల 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర నిర్మాత విఘ్నేశ్‌ శివన్‌. హారర్‌ కథాంశంతో వస్తోన్న ఈ చిత్రంలో నయన నటన అలరిస్తుందని చిత్రవర్గాలు చెబుతున్నాయి. 99నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రంలో ఇంటర్వెల్‌ లేదు. ఏకధాటిగా సినిమా కొనసాగుతుంది. ‘మాయ’ చిత్రం తర్వాత అశ్విన్‌ దర్శకత్వంలో నయనతార నటించిన చిత్రమిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని