Cinema News: జీవితాంతం వేధించే గాయాలు

అనూష శర్మ, శ్రీనివాస్‌, అంకిత్‌ నాయుడు, శ్రీజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నో రామ..రావన్స్‌ ఓన్లీ’. వీరబ్రహ్మం నక్క స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆయనే సంగీత దర్శకుడిగానూ వ్యవహరించారు. ప్రస్తుతం నిర్మాణానంతర

Updated : 14 Apr 2022 09:13 IST

నూష శర్మ, శ్రీనివాస్‌, అంకిత్‌ నాయుడు, శ్రీజ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నో రామ..రావన్స్‌ ఓన్లీ’. వీరబ్రహ్మం నక్క స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆయనే సంగీత దర్శకుడిగానూ వ్యవహరించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత మాట్లాడుతూ.. ‘‘ఇదొక భిన్నమైన సైకలాజికల్‌ థ్రిల్లర్‌. ఆద్యంతం భావోద్వేగభరితంగా సాగుతుంది. పసి వయసులో మనసుకు అయ్యే గాయాలు జీవితాంతం ఎలా వేధిస్తాయి? అనే అంశంతో రూపొందింది. త్వరలో ట్రైలర్‌ విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ సినిమాలో అనిత, తిరుపతి, బేబీ నందిని, కార్తిక్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు