
No Time To Die: బాండ్ 25వ చిత్రం ఫైనల్ ట్రైలర్.. అదరగొట్టేసింది!
ఇంటర్నెట్డెస్క్: ప్రపంచవ్యాప్తంగా జేమ్స్ బాండ్ చిత్రాలకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఈ బాండ్ సిరీస్ నుంచి 24 చిత్రాలు వెండితెరపై సందడి చేయగా.. ఇప్పుడు 25వ చిత్రంగా ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. డేనియల్ క్రేగ్ హీరోగా నటిస్తున్న చిత్రమిది. విలన్ సఫీన్గా రామి మాలెక్ నటిస్తున్నారు. కారీ జోజి దర్శకుడు. గతేడాది విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. ఇప్పుడీ చిత్రాన్ని సెప్టెంబరులో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. భారత్లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ విడుదల చేయనున్నారు. సెప్టెంబరు 30న బాండ్ థియేటర్లలో సందడి చేయనున్నాడు. అమెరికాలో అక్టోబరు 8న ‘నో టైమ్ టు డై’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫైనల్ ట్రైలర్ బాండ్ 25వ చిత్రంపై మరింత ఆసక్తిని పెంచుతోంది. అలరించే యాక్షన్ సన్నివేశాలతో సాగిన ట్రైలర్ను మీరూ చూసేయండి.