సూర్య నారాయణ.. ‘101 జిల్లాల అందగాడు’

అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న  చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు.

Updated : 07 Dec 2022 13:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అవసరాల శ్రీనివాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్నారు. రుహానీ శర్మ కథానాయిక.  టైటిల్‌ గీతాన్ని తాజాగా విడుదల చేసింది చిత్రబృందం. పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లోని అందగాళ్లని మించిన అందగాడు సూర్య నారాయణ అంటూ సరదాగా సాగుతుందీ పాట. భాస్కరభట్ల సాహిత్యం అందించగా సింహ ఆలపించారు. శక్తికాంత్‌ కార్తీక్‌ స్వరాలు సమకూర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై దిల్‌రాజు - క్రిష్‌ సమర్పిస్తున్నారు. శిరీష్‌, రాజీవ్‌ రెడ్డి, సాయి బాబు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మే 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని