Nora Fatehi: అసభ్యంగా ప్రవర్తించాడు.. అందుకే చెంప పగలగొట్టా: నోరా ఫతేహి

హీరోయిన్‌ నోరా ఫతేహి (Nora Fatehi) తన తొలి సినిమా షూటింగ్‌లో జరిగిన సంఘటనను గుర్తుచేసుకుంది. సహ నటుడు తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో  వెంటనే అతడి చెంప పగలగొట్టానని తెలిపింది.

Updated : 02 Mar 2023 10:59 IST

హైదరాబాద్‌: బాలీవుడ్‌తోపాటు తెలుగులోనూ పలు ఐటెమ్‌ సాంగ్‌లతో అలరించి గుర్తింపు తెచ్చుకుంది నోరా ఫతేహి (Nora Fatehi). టాలీవుడ్‌లో ‘బాహుబలి’ (Baahubali), ‘టెంపర్‌’, ‘కిక్‌2’ వంటి సినిమాల్లో తన డ్యాన్స్‌తో అభిమానులను సొంతం చేసుకుంది. సినీ ప్రియులు డ్యాన్సింగ్‌ క్వీన్‌ అని పిలుచుకునే ఈ ముద్దుగుమ్మ తన తొలిసినిమా షూటింగ్‌లో ఆమె కోస్టార్‌తో గొడవపడిందిట. తన జీవితంలో ఎదురైన ఆ చేదు అనుభవాన్ని నోరా ఫతేహి ఓ ఇంటర్వ్యూలో గుర్తుచేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారడంతో.. పలువురు నెటిజన్లు దీనిపై కామెంట్స్‌ చేస్తున్నారు.

‘‘నా తొలి సినిమా ‘రోర్‌’ లోని కొన్ని సన్నివేశాలు బంగ్లాదేశ్‌లో చిత్రీకరించారు. అక్కడ సీన్‌లో నటిస్తోన్న నటుడు నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నాకు కోపం వచ్చింది. వెంటనే అతడి చెంప పగలగొట్టాను. దీంతో అతడు కూడా నాపై చేయిచేసుకున్నాడు. ఇద్దరం జుట్లు పట్టకు కొట్టుకున్నాం. సెట్‌లో అందరి ముందే మేము చాలా దారుణంగా ఘర్షణపడ్డాం. అప్పుడు దర్శకుడు జోక్యం చేసుకుని మాకు సర్థి చెప్పి.. మమ్మల్ని ఆపాడు’’ అని నోరా ఫతేహి తెలిపింది. 

2014లో వచ్చిన బాలీవుడ్‌ చిత్రం ‘రోర్‌: టైగర్స్‌ ఆఫ్‌ ది సుందర్‌బన్స్‌’ (Roar: Tigers of the Sundarbans) చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన ఈ అమ్మడు ఆ తర్వాత బిగ్‌బాస్‌ షో ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకుంది. మోడల్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా మాత్రమే కాదు.. నిర్మాతగానూ వ్యవహరించి తనొక మల్టీ టాలెంటెడ్‌ అనిపించుకుంది. ‘ఫిఫా’ (FIFA World Cup) థీమ్‌ సాంగ్‌లోనూ ఆమె డ్యాన్స్ చేయడం విశేషం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని